కేంద్ర ప్రభుత్వం గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్‌

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 02:11 PM

కేంద్ర ప్రభుత్వం గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్‌

మోదీ సర్కార్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. బంగారం క్రయవిక్రయాలకు సంబంధించి గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భభావిస్తోంది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి.

పసిడి నాణ్యత, నకిలీ బంగారు మోసాల నుంచి ప్రజలను రక్షించడం, బంగారు ఆభరణాలను విక్రయించే జువెలర్స్‌కు చట్టబద్దమైన ప్రమాణాలను నిర్దేశించడం వంటి ప్రధాన లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్‌ను తీసుకువస్తోంది.

సాధారణంగా 2021 జనవరి 15 నుంచే గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోకి రావాల్సి ఉంది. అయితే ఈ గడువును జూన్ 1కి పొడిగించారు. దీనికి కరోనా వైరస్ ప్రధాన కారణం. జువెలర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS వద్ద రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.

కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. జువెలర్స్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అంతేతప్ప ఇంకా తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని అమ్మడానికి వీలుండదు. అలాగే బీఐఎస్ మార్క్ తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో 40 శాతం బంగారం మాత్రమే హాల్‌మార్క్‌కు వెళ్తోంది.


జువెలరీ షాపులు కచ్చితంగా గోల్డ్ హాల్‌‌మార్క్ కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. అయితే ప్రజలు వారి వద్ద ఉన్న పాత బంగారాన్ని సులభంగానే విక్రయించొచ్చు. వీటికి గోల్డ్ హాల్ మార్క్ అవసరం లేదు. ఇకపోతే జువెలరీ సంస్థలు కొత్త రూల్స్ ఫాలో కాకపోతే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది.





Untitled Document
Advertisements