మీరు కంప్యూటర్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 05:53 PM

మీరు కంప్యూటర్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి

ఈ యాంత్రికయుగంలో ప్రతి పని కంప్యూటర్ సాయంతోటే నడుస్తోంది. కంప్యూటర్ లేని ఇల్లు, కంప్యూటర్ గురించి తెలియనివారు లేరనే చెప్పవచ్చు.గత కొన్ని సంవత్సారాలుగా కంప్యూటర్ వినియోగించే వారి సంఖ్యా పది రెట్లకు పెరిగిందని అంచనా. రైల్వే టికేట్టుకైనా, బస్సు రిజర్వేషన్ కైనా ఒక్కటేమిటి సమస్తమూ కంప్యూటరే దిక్కు నేడు.మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన కంప్యూటర్ ను ఉపయోగించే వారికొరకు కొన్ని చిట్కాలు తపక పాటించాలి. లేకపోతే ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది.
* రెప్పలు ఆర్పకుండా తీక్షణంగా కంప్యూటర్ స్క్రీన్ మీదే ద్రుష్టి పెట్టి పని చేస్తున్న వారిలో ఐ బ్లింకింగ్ తక్కువగా ఉండి, కళ్ళు డ్రై అయిపోతాయి. కాబట్టి కంప్యూటర్ ముందు పని చేసే ప్రతి ఒక్కరూ లేచి అటు ఇటు ఓ నాలుగుసార్లు తిరిగి శుభ్రమైన నీటితో కళ్ళు కడుక్కోవాలి. దీనివల్ల కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది. మల్లి పని చేయడానికి ఆసక్తి పెరుగుతుంది.
* కంప్యూటర్ స్క్రీన్ ను కనీసం రెండడుగుల దూరం ఉండేలా మీ కంప్యూటర్ స్క్రీన్ ను అమర్చుకోండి.ముఖానికి దగ్గరగా ఉంచుకోకండి. మంచి వెలుతురు ఉండే గదిని ఎన్నుకోవాలి. లైటు తప్పనిసరిగా ఉండాలి. కిటికీకి దగ్గరగా లేకుండా స్క్రీన్ మీద ఎటువంటి కాంతి పడకుండా జాగ్రత్తపడండి. అప్పుడప్పుడు తల తిప్పి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చుడండి.మీ దృష్టిని అప్పుడప్పుడు కంప్యుటర్ స్క్రీన్ నుండి మరల్చండి.
* టేబుల్ ల్యాంపు లైట్ వాడకండి. రోజంతా కంప్యూటర్ ఏసీ గదిలో పని చేసేవారు 2 గంటలక్కొక్క మారు 2 లీటర్లు నీళ్ళు తాగుతుండాలి. శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా, కళ్ళు కాంతివంతంగా ఉంటాయి.
* మీరు కూర్చున్నప్పుడు మీ కాళ్ళు నేలను తాకాలి.గాలిలో తేలకూడదు. పాదాలు ఆనకపోతే తగినంత ఎత్తు లో ఓ స్టూల్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఫుట్ రెస్ట్ గా ఉంటుంది.
* మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు కుర్చీ వెనుక భాగంలో పూర్తిగా అనుకోని కంఫర్ట్ గా పనిచేసేలా ఓ పిల్లోను సపోర్టుగా పెట్టుకొండి. ఈ పిల్లో వెన్నుకు సీట్ బ్యాకుకు మధ్యలో ఉండాలి. అప్పుడు చక్కగా మోకాళ్ళు చాపి హాయిగా పనిచేసుకోవచ్చును. మానిటర్ మీ తలకు ఎదురుగా ఉండాలి.
* కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గంటకోసారి పాలింగ్ చేయాలి. అరచేతులు కళ్ళకు ఒత్తిడి కలిగించకుండా రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి.
* కీ బోర్డు, మౌస్ లాంటివి మీ మోచేతికి వీలుగా అమర్చుకోండి. రిస్ట్కు మంచి సపోర్ట్ లభించేలా క్రాసుగా ఏర్పాటు చేసుకోండి.
* కంప్యుటర్ ముందు కూర్చొని పనిచేసేవారు ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.





Untitled Document
Advertisements