ప్రకృతి చికిత్సతో ఆరోగ్యం మీసొంతం !

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:12 PM

ప్రకృతి చికిత్సతో ఆరోగ్యం మీసొంతం !

ప్రకృతి నియమాలను అనుసరించి సహజ పద్దతులలో చేసే చికిత్సే ప్రకృతి చికిత్స. వ్యాదులతో పోరాటం చేయటానికి ప్రకృతి ఒక ఏర్పాటుతో అన్ని ప్రాణులను వ్యాధి రహితంగా తయారుచేసింది. ఈ వ్యవస్థ ఆగిపోకుండా శరీరం 24 గంటలు పనిచేస్తుంది. మనం ప్రకృతి నియమాలను అనుసరించినప్పుడు, క్రమబద్దంగా లేని సమయాల్లో ఆహారం తినటం, సరైన సమయానికి నిద్రించకపోవటం లాంటివి చేసినప్పుడు అనారోగ్యానికి గురవుతుంటాము.
మన శరీరం పంచభుతాలైనా భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్నిలతో తయారైయింది. ఈ పంచభూతాలు, వాటి శక్తి మన శరీరంలో పంపిణీ అవుతాయి.ప్రతీ పనిలో వాటి ఉనికి ఉంటుంది. కానీ ఈ కదలికలో ఏ రకమైన అద్దంకి లేకపోతే ఆ వ్యాధి రూపం దాలుస్తుంది. కేవలం ప్రకృతి చికిత్స ద్వారా మాత్రమే ఈ అసమానతను నయం చేయగలం. ప్రకృతి చికిత్స్డ మనస్సు, శరీరం, ఆత్మల చికిత్స కాగా ఇతర చికిత్సలు శరీరానికి మాత్రమే.
వ్యాధి కలగటానికి అసహజమైన జీవన శైలి మరియు శరీరంలో చేరిన మాలిన పదార్దమే కారణం. దీని గురించి కొంచెము ఆలోచిస్తే వ్యాధి మన శత్రువు కాదని మనం దీన్ని సక్రమంగా నయం చేయకపోతే పెరిగి, నయం చేయలేనిదిగా తయారవుతుంది. వివిధ పేర్లతో పిలువబడుతున్నప్పటికీ అన్ని వ్యాధులు ఒక్కటే. అవి అసమతుల్యమైన ఆహారం. కాలుష్య భరిత మల పదార్డంలోనే తేడా. ఇవి రక్తాన్ని కలుషితం చేస్తాయి. కొందరు అతిసారా, జ్వరం, చర్మవ్యాధుల వంటి అనేక విదాలుగా భాదపడితే మరికొందరు వంతులు, విరేచనాలు జ్వరం రూపంలో బయటపడతాయి.రోగా క్రిములు, శరీరంలోని మలినాలను శరీరం సహజంగానే తొలగించేందుకు పని చేస్తుంది. కాబట్టి ప్రకృతే నయం చేస్తుంది అనవచ్చు. అదే దీర్ఘకాల సమస్యలు నయం కావటానికి కొంత సమయంపట్టినా, సరైన సమయానికి తగిన చికిత్స చేయనట్లయితే అది వ్యాధిగా మారి, నయం చేయలేనిదిగా మారుతుంది. ప్రకృతి చికిత్సలైన ఉపవాసం, యోగా, ప్రాణాయామం, నీటి చికిత్స, మేడ ప్యాకేజీ సూర్యకిరణాల చికిత్స, ప్రాణీకహీలింగ్, రీకి ఆక్యుప్రేష్ర్ లాంటివి అనుసరించటం ద్వారా మనం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇది మన శరీరంలో శక్తి, పంచభూతాలు సమతుల్యాన్ని నిర్వహిస్తుంది. ఆరోగ్యంగా వ్యాధి రహితంగా ఉంచుతుంది.
ప్రకృతి చికిత్సారంగంలో ఎంతో పరిశోధన జరిగింది. కొన్ని సులభమైన ప్రకృతి చికిత్సలననుసరించి అనారోగ్యాన్ని నివారించవచ్చును. వ్యాధుల విషయంలో ఐతే ప్రయోజనాన్ని పొందవచ్చు. తీవ్రమైన వ్యాధులను నయం చేసుకోవచ్చును.
పొద్దున్నే ౩-5 గంటల మధ్య మోల్కొని నిల్వ ఉన్న నీరు రెండు గ్లాసులు తాగి కాలకృత్యాలు తీర్చుకొని నడకను ప్రారంభించాలి. ఆసనాలు వేయాలి అనుకునే వారు మకరాసనం, తడాసనం, మర్కటాసనం, భుజంగాసనం, షవాసనం వంటి యోగాసనాలు, కపాలభూతి, భస్త్రిక, అనులోమ-విలోమ, ప్రాణాయామాలను సాధన చేయాలి. ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరాన్ని ఎంతో చురుకుగా ఉంచుతాయి. వారానికో రోజు ఉపవాసం ఉండాలి. నిమ్మరసం, తేనే గోరువెచ్చటి నీటిలో వేసుకుని త్రాగాలి. ఇలా చేస్తే అజీర్ణాన్ని తొలగించి మాలిన పదార్దాలను బైటికి పంపుతుంది.
వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి బహిరంగ ప్రదేశంలో 10 - 15 నిమిషాలు కూర్చోండి. మానసిక ప్రశాంతతకు ప్రధాన ప్రాణశక్తిని బలపరుస్తుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. శీతాకాలంలో గోరువెచ్చటి నీటిలో ఓ చెంచాడు రాళ్ళా ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత సాధారణ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. బద్దాకాన్ని అధిగమిస్తుంది. ఆరు నెలలకోసారి మడ్ ప్యాకేజీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరానికి చల్లదనం కలిగించి, మలినాలను తొలగిస్తుంది. ఒత్తిడిని అధిగమిస్తుంది. చురుకుదనం శక్తినిస్తుంది. జుట్టుకు కూడా ప్రయోజనకరం. శారీరకంగా, మానసికంగా కూడా ప్రయోజనకరం.
అలాగే తిన్నగా చూస్తూ, వెన్నుపూస నిటారుగా ఉంచి నడవాలి. నాభిలో వేలు పెట్టి సవ్య దిశలో, అపసవ్యదిశలో 20 సార్లు అటూ, ఇటు తిప్పాలి. ఇది సమతుల్యాన్ని నిర్వహించి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా కడుపు కాలిగా ఉంది అనుకున్నప్పుడే చేయాలి. మన జీర్ణ శక్తిని బట్టి ఆహారాన్ని తినాలి ఆహారం తినేటప్పుడు ఏ ఆలిచనలు రానివ్వకూడదు. జంక్ ఫుడ్ తినడం మానేయండి. భోజనం అయ్యాక గంట తర్వాత కావలసినంత నీరు తాగండి త్వరగా నిద్రపోయి,త్వరగా ముల్కొనడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
రాత్రుళ్ళు కడుపు నిండా భోజనం చేయటాన్ని నిషేదించండి. మిత ఆహారం ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకోండి.





Untitled Document
Advertisements