జ్వరం ఎందుకొస్తుంది ? జ్వరం ఉంటే కోవిడ్ సోకినట్టేనా?

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 05:08 PM

జ్వరం ఎందుకొస్తుంది ? జ్వరం ఉంటే కోవిడ్ సోకినట్టేనా?

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ ప్రజలను వణికిస్తున్న తరుణంలో కరోనాని కట్టడి చేయడానికి ప్రతిఒక్కరు కూడా బాధ్యత యుతంగా ప్రభుత్వం వారు నిర్దేశించిన విధి విధానాలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు, అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా రక్స్శించిన వారు అవుతారు.
ప్రస్తుతం కరోనా వ్యాధి నిర్దారణకు సంబంధించిన లక్షణాలలో ప్రధానంగా చెప్పుకోబడేది జ్వరం. అయితే జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి కోవిడ్ ఉన్నట్టు కాదు అనేది గుర్తుంచుకోవలసిన విషయం.
వాతావరణంలోని అధిక వేడిమి కారణంగా శరీరంలోని వేడిని చక్కబరిచే క్రమము అదుపు తప్పి జ్వరం వస్తుంది. ఏదైనా ఆపరేషన్ తర్వాత కూడా ఆ నొప్పి తీవ్రతని తట్టుకోలేక జ్వరం వస్తుంది. వాతరనంలోని మార్పులు తట్టుకోలేని వారికి (రెసిస్టెన్స్) జ్వరం వస్తుంది. అజీర్తి సంభవించినప్పుడు వాంతులు, విరేచనాలప్పుడు కొన్ని రకాల మందులు వాడినప్పుడు, రక్త మార్పిడి సమయంలోనూ, కొందరికి గ్లూకోజ్ ఎక్కించే సమయంలోనూ జ్వరం వస్తుంది. శుఛి-శుభ్రత పాటించక సూక్ష్మజీవుల వలన శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు జ్వరం వస్తుంది. టిష్యుల క్షీణత జరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
బ్యాక్టీరియా, పరాన్న జీవుల వలన, పరిశుభ్రంగా ఉన్న నీటిని త్రాగకపోవటం వలన నాడీ మండలం వ్యాధులలోనూ, గుండెకు సంభందించిన వ్యాధులు సంభవించినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. భయపడినప్పుడు వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోకపోయినా జ్వరం వస్తుంది. చెమట పడుతుంది.
జ్వరం ఒకేసారి పెరిగినప్పుడు చలి, వణుకు, జ్వరం వచ్చి మనిషిని ఒక్కసారిగా గాభరా పెడుతుంది. ఈ కారణాల వల్ల జ్వరం వచ్చినప్పుడు వ్యాధి నిర్ణయం జరగటానికి చాల సమయం పడుతుంది. విష జ్వరాలు ప్రబలినప్పుడు, ఆరోగ్య పరిరక్షణలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రక్త పరీక్షలు చేయించుకునే అవసరాన్ని బట్టి రోగనిర్దారణ చేసుకుని దానికి అనుగుణంగా వైద్య చికిత్స చేయించుకోవాలి. మీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను నీటి నిలువలు లేకుండా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే రోగం తగ్గుముఖం పట్టి, రూపుమాసిపోతుంది.అదే మలేరియా జ్వరం అయితే రోజు విడిచి రోజు వస్తుంది. చలి, వేడి విపరీతంగా పట్టి మనిషి అల్లడిపోతాడు. నీరసించి, రక్తహీనతకు గురవుతాడు. రోగ నిర్దారణ, చికిత్స తర్వాత రోగికి స్వస్థత చేకూరేదాకా ఆహారం, నీరు, మందుల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా అవసరం.
దోమలను నిర్మూలించడం ద్వారా మలేరియా వ్యాప్తిని అదుపు చేయవచ్చును. దోమ కాటు నుండి రక్షణకు దోమ తెరలు విధిగా వాడాలి. వేపనూనేను శరీరానికి రక్షణగా శరీరమంతా రాసుకుంటే దోమ కాటు నుండి రక్షణ పొందవచ్చు.
ఎయిడ్స్ వ్యాధి వస్తే చాలాకాలం జ్వరం వస్తుంది. అదే విధంగా ఫ్లూ జ్వరం వల్ల శరీర అవయవాలకు దెబ్బతగిలి చీము కారడం లాంటి కారణాల వల్ల సాధారణంగా జ్వారాలు వస్తాయి. జ్వరాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని మరీ చికిత్స చేయించుకోవాలి. అంతుపట్టని డెంగ్యుజ్వరం, క్షయ, కాలేయం చీము పట్టి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇటువంటి వాటిలో బోదకాలు కూడా ఒకటి.
శరీర అవయవాలు ఎక్కడెక్కడ దెబ్బ తిన్నాయో తెలుసుకొని చికిత్స చేయించుకోవడం అవసరం. చెవులు, ముక్కు, పళ్ళు, మూత్రనాళం, ఊపిరితిత్తులు, మెడ ఇతర శరీర అవయవాలను పరిశీలించి, పరీక్షించి తెలుసుకోవాలి. చర్మ సంబంధిత రోగాల వల్ల కూడా జ్వరాలు వస్తాయి. దద్దుర్లు వచ్చినా, గవద బిళ్ళలు వాయడం వల్ల కూడా జ్వరం వస్తుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు, అంటు వ్యాదులు వచ్చిన సమయంలో విరేచనాలతో కూడిన జ్వరం వస్తుంది.
సూక్ష్మజీవుల వల్ల మలవిసర్జన త్వర త్వరగా వస్తుంది. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తే మలవిసర్జన అంతగా ఉండదు. అదే టైఫాయిడ్ వచ్చిన 2 - ౩ వారాల తర్వాత రక్తం పడుతుంది. అమీబా వంటి జీవులున్న చోట రక్త విరోచనాలు అవుతాయి.
ప్రతిమనిషి మూడు నెలలకు ఒకసారి మలమూత్ర, రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, శుఛీ-శుభ్రతలను పాటిస్తుంటే రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.
ప్రస్తుత పరిస్థితులలో ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా సరే వెంటనే వైధ్యున్ని సంప్రదించి, వైద్యుడి సలహా మేరకు మందులు వాడడం ఉత్తమం. గృహ వైద్యం పనికిరాదు అనే విషయం మర్చిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.





Untitled Document
Advertisements