భారీగా తగ్గిన బంగారం ధర!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 10:51 AM

భారీగా తగ్గిన బంగారం ధర!

పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర నేలచూపులు చూసింది. పసిడి వెలవెలబోయింది. బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర మూడు నెలల కాలంలో భారీగా తగ్గింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర జనవరి1న రూ.51,060 వద్ద ఉండేది. ఇప్పుడు ఇదే బంగారం ధర రూ.48 వేల వద్ద ఉంది. అంటే పసిడి రేటు రూ.3 వేలకు పైగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.2,800 దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే వెండి రేటు మాత్రం పైకి కదిలింది. గత మూడు నెలల కాలంలో వెండి రేటు పెరిగింది. జనవరి 1న కేజీ వెండి రేటు రూ.72,400 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు వెండి రేటు రూ.73,400 వద్ద ఉంది. అంటే వెండి ధర ఈ కాలంలో రూ.1000 పైకి చేరిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే బంగారం ధర ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి రేటు తగ్గినప్పుడు కొనొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.





Untitled Document
Advertisements