కరోనా మూడో దశ? మలమూత్ర విసర్జన ద్వారా వైరస్‌ బహిర్గతం!!!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:47 AM

కరోనా మూడో దశ? మలమూత్ర విసర్జన ద్వారా వైరస్‌ బహిర్గతం!!!

కరోనా సెకండ్ వేవ్‌తో దేశ వ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ మరోసారి పెరుగుతున్న పాజిటివ్ కేసులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే రెండో దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదనే భావన ఇప్పుడు వైద్యుల్లో, అధికారుల్లో వ్యక్తమవుతోంది. రెండో దశే మాత్రమే కాదు.. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ కూాడా రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని తెలిపారు. మురుగునీటి విశ్లేషణ ద్వారా నెల రోజుల్లో వ్యాప్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

దీనిపై ఐఐసీటీ, సీసీఎంబీలు కలిసి గత ఆగస్టులో కొవిడ్‌ మొదటి ఉద్ధృతి సమయంలో హైదరాబాద్‌లో అధ్యయనం చేశాయి. నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకిందని, నెల రోజుల వ్యవధిలో సాధారణ స్థితికి వచ్చిందని గుర్తించారు. ఈ పరిశోధనను మరింత విస్తృతపర్చి ఐఐసీటీలోని బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ ల్యాబ్‌ ప్రామాణిక అధ్యయన పద్ధతిని అభివృద్ధి చేసింది. తద్వారా కరోనా మూడో దశను ముందే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.





Untitled Document
Advertisements