గుడిలో ప్రదక్షిణలు ఎందుకు?

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:55 PM

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు?

మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పెద్ద వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమంటారు. అసలు గుడిలో గుడిలో ప్రదక్షిణలు చేయమనడానికి కారణం ఏంటి అంటే.. 'ప్రదక్షిణం' లో 'ప్ర' అనే అక్షరము చేసిన పాపాల నాశనముకు ..'ద' అన్న అక్షరము మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని. 'ణ' అను అక్షరము అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇవ్వమని. భగవంతుడి ముందు చుట్టూ తిరిగే ప్రదక్షిణంతో ఇంత అర్ధం ఉంది. పూర్వం వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణము చేసిన భూ ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుడు ముందు చేసే ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని ముందు చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం.

Untitled Document
Advertisements