క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ విలువను పెంచిన జియో‌...

     Written by : smtv Desk | Tue, Dec 26, 2017, 03:20 PM

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ విలువను పెంచిన జియో‌...

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, రీఛార్జులపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ విలువను పెంచింది. తాజాగా రూ.399 లేదా అంతకుమించి రీఛార్జులపై ఈ ఆఫర్ల విలువను పెంచుతూ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఉన్న క్యాష్ బ్యాక్ రూ.2,599ను రూ.3,300 వరకు పెంచుతూ, జనవరి 15 వరకు పొందే అవకాశాన్ని కల్పించింది.

ఈ అఫర్‌లో భాగంగా రూ.400ల విలువైన మై జియో వోచర్లు, వ్యాలెట్ల నుంచి తక్షణం క్యాష్‌ బ్యాక్‌ను పొందే వీలున్న రూ.300ల విలువైన వోచర్లు, ఇ-కామర్స్‌ సంస్థల నుంచి రూ.2,600 వరకు రాయితీ వోచర్ల చొప్పున మొత్తం రూ.3,300 వరకు ప్రయోజనం పొందొచ్చని సంస్థ వెల్లడించింది.







Untitled Document
Advertisements