'రాధే శ్యామ్'లో కొత్త పూజ ను చూస్తారు...పూజహెగ్డే

     Written by : smtv Desk | Tue, Oct 19, 2021, 01:05 PM

'రాధే శ్యామ్'లో కొత్త పూజ ను చూస్తారు...పూజహెగ్డే

వరుస విజయాలతో దూసుకుపోతూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అమ్మడు. ఇంతకీ ఎవరీ అమ్మడు అనుకుంటున్నారా? టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నను ఎవరిని అడిగినా, పూజ హెగ్డే పేరే చెబుతారు. ప్రస్తుతం ఈ సుందరి వరుస అవకాశాలతో .. వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇక ఆ తరువాత చిత్రాలుగా 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' లైన్లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి పూజ హెగ్డే మాట్లాడుతూ, 'రాధే శ్యామ్'లో 'ప్రేరణ' పాత్రలో కొత్త పూజ హెగ్డేను చూస్తారు. అలాగే 'ఆచార్య'లో నేను పోషించిన 'నీలాంబరి' పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ పాత్రను కొరటాల గారు డిజైన్ చేసిన తీరు నాకు ఎంతగానో నచ్చింది అన్నారు.
సినిమా .. యాక్టింగ్ నా ప్రాణం. అందుకే నటనకు సంబంధించిన పనిచేస్తూ ఉండటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను .. పనిలోనే నాకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మాత్రం మంచి సంగీతం వింటాను. ఆ తరువాత మళ్లీ ఫుల్ ఎనర్జీతో నా పనిని నేను చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements