ఫ్రూట్స్ బేస్డ్ డైట్ లో ఉన్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

     Written by : smtv Desk | Sat, Oct 23, 2021, 12:17 PM

ఫ్రూట్స్ బేస్డ్ డైట్ లో ఉన్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

రోజురోజుకి బరువు తగ్గాలి అనే ఆలోచన యువతలో చాలా బలంగా నాటుకుపోతుంది. ఫలితంగా డైటింగ్ ఇంకా వర్కౌట్స్ పేరుతో శరీరాన్ని కష్టపెడుతున్నారు. నిజానికి బరువు నియంత్రణలో ఉంచుకోవాలి అనుకుంటే గనుక ఆహారంలో చిన్నపాటి మార్పులు కొద్దిపాటి వ్యాయామంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఒకవేళ అధికబరువుని తగ్గించుకోవాలి అనుకున్న సరే ఆహారంలో మార్పులు చేసుకోవాలే తప్ప ఆహారం మానేసి పిచ్చి పిచ్చి డైటింగ్స్ జోలికి పోవద్దు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఫ్రూట్స్ బేస్డ్ డైట్‌ చాలా పాపులర్ అయ్యింది అయితే.. ఈ ఫ్రూట్స్ బేస్డ్ డైట్‌లో యానిమల్ ప్రొడక్ట్స్ మరియు డైరీ ప్రొడక్ట్స్ అస్సలు ఉండవు. అందుకే దీన్ని హైలీ డైట్ అని అంటారు. ఈ డైట్‌లో భాగంగా పండ్లను మాత్రమే తీసుకుంటారు. ఎటువంటి ధాన్యపు గింజలు మరియు ప్రోటీన్‌కు సంబంధించిన ఆహారాన్ని తీసుకోరు. కాకపోతే కొంతమంది మాత్రం కొన్ని కూరగాయలు, మొలకెత్తిన గింజలు మరియు నట్స్ వంటివి తీసుకుంటారు.
ఫ్రూట్స్ బేస్డ్ డైట్ చేయడం వల్ల చాలా న్యూట్రియన్స్‌ని నష్టపోతారు. అవి ప్రోటీన్స్, ఒమేగా-3, బి విటమిన్స్, క్యాల్షియం మరియు ఐరన్. ఈ విధంగా పోషక విలువలను అందకపోవడంతో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ చాలా రోజుల వరకు ఉంటుంది. వేరే రకాల ఫుడ్‌ను తీసుకోక పోవడం వల్ల ఫ్రూట్స్‌లో ఉండేటువంటి ఫ్రక్టోస్ శరీరంలో చాలా పెరిగిపోతుంది. దాంతో డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు పెరుగుతాయి.ఎంత తింటే అతిగా తిన్నట్టు పండ్లలో అధిక శాతంలో ఫైబర్ మరియు నీరు ఉండటం వల్ల సహజంగా ఎక్కువ శాతం మంది అతిగా తినలేరు.
ప్రస్తుతం భారత దేశంలో పండ్లు మరియు కూరగాయలు ఏవరేజ్‌గా ఒక రోజుకు మూడున్నర సర్వింగ్స్ తీసుకుంటున్నారు. అయితే జనరల్ రికమండేషన్ ప్రకారం రోజుకు ఐదు సర్వింగ్స్ లేదా రోజుకు 400 గ్రాములు తీసుకోవచ్చు. మరి కొన్ని పరిశోధనలు చేయగా ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే రోజుకు ఇరవై సర్వింగ్స్ తీసుకున్న వారిలో కూడా ఎలాంటి అనారోగ్యం ఫలితాలను గుర్తించలేదు. ఈ డేటాకు సైంటిఫిక్ క్రెడిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పరిశోధన లో భాగంగా తక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 16 సైంటిఫిక్ స్టడీస్‌లో పరిశోధనలు జరగగా దీన్ని కనుగొన్నారు. జనరల్ రికమండేషన్ కంటే పండ్లను ఎక్కువ తినడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని ఈ అధ్యయనంలో తేల్చారు.





Untitled Document
Advertisements