పళ్ళ ముక్కలు మొలకెత్తిన గింజలు కలిపి తినడం మంచిదేనా!

     Written by : smtv Desk | Thu, Oct 28, 2021, 04:29 PM

పళ్ళ ముక్కలు మొలకెత్తిన గింజలు కలిపి తినడం మంచిదేనా!

మనం తినే ఆహారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుమానాలు తలెత్తుతుంటాయి. ప్రస్తుత కాలంలో మొలకెత్తిన గింజలు తినడం అనేది దాదాపు  ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయింది. అయితే మొలకలను పచ్చిగా తినడానికి ఇష్టపడనివారు వాటిని వివిధ రూపాలలో తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మొలకెత్తిన గింజలను ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయం తెలుసుకుందాం.
* మొలకెత్తిన గింజలను ముఖ్యంగా పేసర్లను తరచుగా తీసుకుంటే ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
* విత్తనాలను మొలకెత్తిన చేసినప్పుడు వాటి పోషక విలువలు పెరుగుతాయి.
* మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ - సి 30 శాతం, విటమిన్ - సి 60 శాతం ఎక్కువగా ఉంటాయి.
* శనగలు, పెసలు ఇలా ఏదో ఒకే రకమైన గింజల్ని తీసుకునే బదులుగా అన్ని రకాలు కలిపి తీసుకుంటే మరీ మంచిది.
* మొలకెత్తిన గింజల్లో క్యారెట్, చీరాల అంటే కాయగూరలను సన్నగా కోసి వేసుకుంటే పోషక స్థాయి మరింత పెరుగుతుంది. వీటికి రకరకాల పండ్ల ముక్కలను కూడా కలిపి తరచుగా తింటే రుచితో పాటు మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.
అయితే ఈ మొలకెత్తిన గింజలు ఎలా తినాలి అంటే.. రుచి బాగుందనో, ఆరోగ్యానికి మంచిదనో ఏదో ఒక రకమైన పదార్థాన్ని అదేపనిగా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేసి వీటిని తీసుకోవడం సరికాదు. ఇడ్లీ లాంటి టిఫిన్ ల వల్ల కలిగే ఫలితం కూడా తక్కువేమీ కాదు. అలాగని ఈ గింజలను తీసుకోవడంలో అశ్రద్ధ కూడదు. మ్యాక్స్ సమయంలో తీసుకుంటే మంచిది. సాయంత్రం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. పైన కరకరలాడే బూందీ లాంటివి చల్లుకుని తింటే రుచిగా ఉండడమే కాక ఆరోగ్యం చెడకుండా ఉంటుంది. అయితే మొలకెత్తిన విత్తనాలను వేయించి లేదా ఉడకబెట్టి తినడం కొంతమందికి అలవాటు. కానీ ఈ మొలకెత్తిన గింజలను వీలైనంతవరకూ పచ్చిగా తినడం ఉత్తమం. ఎందుకంటే వీటిల్లోని విటమిన్ లో వేడి వల్ల పాడైపోతాయి. మొలకెత్తిన విత్తనాల పోషక విలువ పెంచాలంటే వాటికి పల్లీలు, క్యారెట్ ల వంటివి కలుపుకుని తింటే మరింత మంచిది. క్యారెట్ లో వేస్తే బీటాకెరోటిన్ పెరుగుతుంది. రకరకాల పండ్ల మొక్కలు కలపడం వల్ల పోషకాల శాతం పెరగడమే గాక తినేందుకు మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా మొలకెత్తిన గింజల తో పాటు కూరగాయలు పండ్ల ముక్కలను కలిపి ఉన్నట్లయితే వాటిలో పోషకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక మీదట మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి.





Untitled Document
Advertisements