కళ్ళ కింద వాపు వస్తుందా అయితే ఇలా చేయండి!

     Written by : smtv Desk | Fri, Oct 29, 2021, 04:37 PM

కళ్ళ కింద వాపు వస్తుందా అయితే ఇలా చేయండి!

ఎక్కువ సమయం కంప్యూటర్ పని చేసేవాళ్ళలోనూ, ఎప్పుడూ క్లాస్ రూమ్లో పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్ళలోనూ, అస్తమానం ఫోన్ అదేపనిగా చూసి వాళ్లలోనూ, కళ్లకు ఎక్కువ శ్రమ తప్పని వాళ్ళలోనూ తరచుగా కళ్ళకింద వలయాలు, వాపు వచ్చే అవకాశం ఉంది. వీటిని నివారించడానికి ఇంట్లోనే సొంతంగా చేసుకోగలిగిన కొన్ని చిట్కాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. ఈ చిట్కాలను మీరు ఉదయం కానీ పడుకునే ముందు గానీ ప్రయత్నించవచ్చు.
* ఒక టీ స్పూన్ ఉప్పు లో కొద్దిగా వేడినీటిని కలిపి అందులో కాటన్ ప్యాడ్ ని కానీ కాటన్ క్లాత్ ను కానీ ముంచి కళ్ళ మీద పెట్టాలి. ఇలా చేయడం వలన అలసిన కళ్ళకు స్వాంతన కలిగిస్తుంది.
* కోడిగుడ్డులోని తెల్లసొనను ఒక కప్పు లోకి తీసుకుని దానిని బాగా గిలకొట్టి కొండ చుట్టూ రాయాలి. ఇలా రాసిన తర్వాత కొంతసేపటికి ఆరిపోయి స్కిన్ టైట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి ఇలా చేస్తూ ఉంటే కళ్లకింద చర్మం సాగినట్లు ఉండటం వాపు వంటివి తగ్గుతాయి.
* సాధారణంగా చాలా రకాల ఫేషియల్ ప్యాక్ లకు కళ్లచుట్టూ ఉన్న చర్మం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎగ్ ను మాత్రం కళ్ల కింద కూడా పట్టించవచ్చు. ఎగ్ వైట్ కళ్ళ కింద వాపు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ముఖం చర్మం మడతలు పడినట్లనిపించినా, చర్మం సాగినట్లుగా అనిపించినా కూడా ఎగ్ ని ప్యాక్ లాగా వేసుకోవచ్చు.
* కీరదోసకాయను చక్రాలుగా కోసి వాటిని కళ్లమీద పెట్టుకుని 15 నిమిషాల సేపు ఉంచితే కళ్ళ అలసట పోతుంది. కీరదోసని తురిమి దానిని పల్చటి బట్టలో చుట్టి ప్యాడ్ లాగా చేసుకుని వాటిని కళ్ళమీద పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే కీరరసం త్వరగా కళ్ళకి పడుతుంది. కళ్లమీద పెట్టుకుని పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండటం సాధ్యం కానప్పుడు కీరకాయ రసాన్ని కనురెప్పల మీద, కళ్ళ చుట్టూరా పట్టించాలి. కీరా రసం ఆరిన తరువాత మళ్లీ రసాన్ని పట్టించాలి ఇలా 15 నిమిషాలలో నాలుగైదుసార్లు పట్టించాలి.
* ముఖం కాంతివంతంగా ఉండాలంటే రెండు రోజులకు ఒకసారి క్యాబేజీ జ్యూస్ ని ముఖానికి రాసుకోవాలి. ఒక పావు గంట, 20 నిమిషాల తర్వాత   ఐస్ వాటర్ తో ముఖం కడగాలి.





Untitled Document
Advertisements