ఈ లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వస్తుందట..

     Written by : smtv Desk | Tue, Nov 02, 2021, 03:27 PM

ఈ లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వస్తుందట..

బ్రెయిన్ కి బ్లెడ్ సర్కులేషన్ సరిగ్గా అందకపోయినా, లేక ఆగిపోయినా, తగ్గిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ టిష్యూకు ఆక్సిజన్ తో పాటు పోషకాలు అందవు. బ్రెయిన్ సెల్స్ అనేవి నిమిషాల్లో చనిపోతాయి. స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జన్సీ, సరైన సమయానికి ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే బ్రెయిన్ డేమేజ్ అనేది అంత త్వరగా తగ్గుతుంది. మిగతా కాంప్లికేషన్స్ అనేవి రావు. స్ట్రోక్ నుంచి డీసెబిలిటీకి వెళ్లకుండా ఉండేందుకు సరైన సమయంలో చికిత్స అవసరం.
మీరు ఒకవేళ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్నప్పుడు, లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. లక్షణాలు ప్రారంభదశలోనే ఉన్నప్పుడు కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మాట్లాడంలో ఇబ్బందులు, అలాగే ఇతరులు మాట్లాడేదాన్ని చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. గందరగోళ పరిస్థితి, మాటల్లో తడబాటు, భాషను అర్థం చేసుకోవడంతో కష్టం. ముఖంపై, కాళ్లపై లేదా చేతులపై నంబ్ నెస్ వస్తుంది. అకస్మాత్తుగా నంబ్ నెస్ కు గురవుతారు. సాధారణంగా, ఈ సమస్య శరీరానికి ఒకవైపే వస్తుంది. అటువంటప్పుడు మీరు రెండు చేతులనూ తలకంటే పైకి ఎత్తడానికి ప్రయత్నించాలి. ఒక చేయి పడిపోయిందంటే, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే, నవ్వడానికి ప్రయత్నించినప్పుడు నోటికి ఒకవైపు కిందకు వంగిపోతుంది. ఒక కంటిలోని చూపు మందగిస్తుంది. సడెన్ గా విజన్ బ్లర్ గా మారిపోతుంది. వస్తువులన్నీ రెండు రెండుగా కనిపిస్తాయి. తలనొప్పి. సడన్ అలాగే సివియర్ తలనొప్పి వస్తుంది. వాంతులు కూడా పట్టుకుంటాయి. తలతిరగడం లేదా కాన్షియస్ నెస్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మీకు స్ట్రోక్ గురించి తెలియచేసే లక్షణాలు. నడకలో తడబాటు వస్తుంది. బాలన్స్ కోల్పోతారు. శరీరంలోని కో ఆర్డినేషన్ కోల్పోతారు. సడన్ గా డిజ్జీనెస్ వస్తుంది.
వీటిలో ఏ లక్షణాలు కనిపించినా మెడికల్ హెల్ప్ అనేది తప్పనిసరి అని గుర్తించండి.
చాలా ఫ్యాక్టర్స్ స్ట్రోక్ రిస్క్ ను పెంచుతాయి. ట్రీట్ చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి
* అధిక బరువు లేదా ఒబెస్ గా ఉండటం
* శారీరకంగా యాక్టివ్ గా ఉండకపోవడం
* ఎక్కువగా మద్యపానం చేయడం
*ఇల్లీగల్ డ్రగ్స్ ను వాడటం
* హై బ్లడ్ ప్రెజర్
* సిగరెట్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్పోజర్
* హై కొలెస్ట్రాల్
* డయాబెటిస్
* అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా
* హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ డిఫెక్ట్స్, హార్ట్ ఇన్ఫెక్షన్ లేదా అబ్నార్మల్ హార్ట్ రిథమ్ వంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్
* స్ట్రోక్ కి సంబంధించిన వ్యక్తిగత లేదా ఫ్యామిలీ హిస్టరీ.
* వయసు - 55 సంవత్సరాలు పైబడిన వారిలో చిన్నవారితో పోల్చితే స్ట్రోక్ బారిన పడే ప్రమాదం ఎక్కువ.
* హార్మోన్ థెరపీస్ అలాగే బర్త్ కంట్రోల్ పిల్స్ ను వాడేవారిలో రిస్క్ ఎక్కువ
స్ట్రోక్ అనేది కొన్నిసార్లు టెంపరరీ లేదా శాశ్వతమైన వైకల్యాలు దారితీస్తుంది. బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లో ఎంతకాలం నుంచి తగ్గింది బ్రెయిన్ లోని ఏ భాగం ప్రభావితమైంది అన్న విషయంపై సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేవి ఇలా ఉంటాయి:
పక్షవాతం లేదా మజిల్ మూవ్మెంట్ లేకపోవడం. శరీరంలోని ఒక వైపు భాగానికి పక్షవాతం వస్తుంది. కొన్ని మజిల్స్ పై కంట్రోల్ కోల్పోవడం జరుగుతుంది. ముఖంలోని ఒక వైపు అలాగే ఒక చేయిపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది.
మాట్లాడడంలో అలాగే మింగడంలో కష్టం. స్ట్రోక్ అనేది నోరు అలాగే గొంతు వద్ద కండరాలపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. దాంతో, మాట్లాడటం, మింగడం అలాగే తినడం వంటివి కష్టంగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. ఎదుటివారి మాటలను అర్థం చేసుకోవడం కూడా కష్టమే. చదవడం అలాగే రాయడం కూడా కష్టమే.
మెమరీ లాస్ లేదా థింకింగ్ డిఫికల్టీస్ వస్తాయి. స్ట్రోక్ కు గురైన చాలామంది మెమరీ లాస్ ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకొంతమందికి ఆలోచనలో ఇబ్బందులు, రీజనింగ్ అలాగే జడ్జెమెంట్స్ లో ఇబ్బంది అలాగే కాన్సెప్ట్స్ ను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు.
స్ట్రోక్స్ ఉన్నవారు తమ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. డిప్రెషన్ కు గురవుతారు.
నొప్పి, తిమ్మిరి లేదా కొన్ని అసాధారణ సెన్సేషన్స్ అనేవి స్ట్రోక్ కి గురైన శరీరంలోని భాగంలో వస్తాయి. ఉదాహరణకు స్ట్రోక్ వల్ల ఎడమచేతి లోని స్పర్శను కోల్పోతే, అసౌకర్యమైన టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది.
ప్రవర్తనలో మార్పులు వస్తాయి. రోజువారీ యాక్టివిటీస్ లో కూడా ఇతరుల సహాయం అవసరపడుతుంది.
స్ట్రోక్ కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ను తెలుసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం, ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించడం వంటి స్టెప్స్ అనేవి స్ట్రోక్ సమస్యను అరికడతాయి. స్ట్రోక్ ను అరికట్టే స్ట్రాటజీస్ అనేవి హార్ట్ డిసీజ్ ను అరికట్టే స్ట్రాటజీస్ వంటివే. హెల్తీ వెయిట్ ను మేనేజ్ చేయడం,బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవడం, డైట్ లో కొలెస్ట్రాల్ అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ ను మితంగా తీసుకోవడం, టొబాకోను వదిలేయడం, డయాబెటిస్ ను మేనేజ్ చేయడం, పండ్లు అలాగే కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం, తరచూ వ్యాయామం చేయడం వంటివి స్ట్రోక్ బారిన పడకుండా హెల్ప్ చేస్తాయి.






Untitled Document
Advertisements