ఇలా చేస్తే ఎటువంటి ఖర్చులేకుండానే మీ ముఖం పై వెంట్రుకలు తొలగించొచ్చు!

     Written by : smtv Desk | Fri, Nov 12, 2021, 06:48 PM

ఇలా చేస్తే ఎటువంటి ఖర్చులేకుండానే మీ ముఖం పై వెంట్రుకలు తొలగించొచ్చు!

కొంతమందికి ముఖం మీద వెంట్రుకలు వేదిస్తుంటాయి. చూడడానికి తెల్లగా అందంగా ఉన్నప్పటికీ ముఖం మీద వెంట్రుకలు చికాకు పెడుతుంటాయి. అటువంటప్పుడు ఆ వెంట్రుకలను తొలగించడానికి రకరకాల పద్దతులను ఉపయోగిస్తుంటారు. అయితే ముఖం మీద లేదా గడ్డం మీద వెంట్రుకలు తొలగించడానికి మీ ముఖం మీద కెమికల్స్‌ను వాడొద్దు. వాటి వల్ల మీ చర్మం మండుతుంది, అంతేకాకుండా చికాకును కలిగిస్తాయి. బదులుగా మీ మొఖం మీద జుట్టును తొలగించడానికి సహజ మార్గాలను ఫాలో అవ్వండి.
ఇందుకోసం వాడే పదార్థాలలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి శరీర భాగాల్లో అధిక శాతం ఉండేది చర్మం. అటువంటి చర్మానికి ఏ ఇతర పదార్థాలు తగిలినా, అది డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి వెళ్ళొచ్చు. హెయిర్ రిమూవర్‌లో ఉండే కెమికల్స్ మీ చర్మాన్ని నాశనం చేయవచ్చు, లేదా మీ చర్మానికి మంట కలిగించవచ్చు. అటువంటివి వాడేకంటే, ఈ సహజ పద్ధతుల్లో మీ చర్మాన్ని తొలగించడం మంచిది. ముఖం మీద లేదా గడ్డం మీద అప్పుడప్పుడే మొలిచిన వెంట్రుకలు చాలా సున్నితంగా ఉంటాయి.
అవి తొలగించడానికి ఉండే మరో మార్గం షేవింగ్. షేవింగ్ వల్ల హెయిర్ మందంగా తయారవుతుంది, అంతేకాకుండా ఎక్కువగా పెరుగుతుంది.
లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విధానం. మీ ముఖంపై వెంట్రుకలు తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్‌లో ఎలక్ట్రాలసిస్ మరియు లేజర్ టెక్నాలజీని వాడతారు. ఈ పద్ధతి పర్మినెంట్గా వెంట్రుకలు తొలగించినా ఒకటికి రెండు సార్లు చేయవలసి వస్తుంది.
స్పా లేదా సెలూన్‌లో ఇవి తొలగించడానికి వ్యాక్సింగ్ లేదా త్రెడ్డింగ్ ఉపయోగిస్తారు. అవి ఖర్చుతో కూడుకున్నవే.
సహజ మార్గాలతో డబ్బు మిగులుతుంది. అంతేకాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ సహజ మార్గాలను తెలుసుకోండి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

1)తేనె మరియు పంచదార
తేనె మరియు పంచదార కలిపి పేస్ట్‌గా చేసి ఫేస్‌కి రాసుకోవడం వల్ల మీ వెంట్రుకలను తొలగించవచ్చు. తయారీ చేసే విధానం, ఒక టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ పంచదార, ఒక టేబుల్ స్పూను నీరు. మూడింటిని పేస్ట్‌లా కలిపి, మైక్రోవేవ్‌లో పెట్టాలి. అది చల్లారాక తీసి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకోవాలి. డ్రై అయ్యేదాకా వెయిట్ చేసి, దానిని ఫేస్ వాక్స్ తీసినట్లు తీసేయండి. చివరిగా మీ ముఖాన్ని తడిగా ఉండే గుడ్డతో తుడుచుకోండి.

2) తేనె మరియు నిమ్మరసం
ఒక టేబుల్ స్పూన్ అప్పుడే పిండిన నిమ్మరసం నాలుగు టేబుల్ స్పూన్ల తేనె కలిపి పేస్టులాగా తయారుచేయండి. ఆ పేస్ట్ను, మీకు ముఖంపై ఎక్కడైతే వెంట్రుకలు ఉన్నాయో అక్కడ అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకూ వదిలేయండి. ఆ తర్వాత గోరు వెచ్చని తడి గుడ్డతో మాస్క్‌ను తొలగించండి.

3) చక్కెర మరియు నిమ్మరసం
ఈ పద్ధతి చాలా చక్కగా పనిచేయడమే కాకుండా మీ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇందులో వాడే నిమ్మరసం వల్ల మీ చర్మానికి విటమిన్ సి తగిలి మీ చర్మం రిఫ్రెష్ అవుతుంది. దీన్ని తయారు చేసే విధానం.
అప్పుడే పిండిన కొంచెం నిమ్మరసం, పంచదార మరియు కొంచెం నీళ్లు కలిపి పేస్టులాగా తయారుచేయండి. పేస్ట్ కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి, లేకుంటే కొంచెం పంచదార యాడ్ చేయండి. మిగిలిన దాన్ని మీరు ఫ్రిజ్‌లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా కలిపిన పేస్ట్‌ని ముఖంపై పెరిగిన వెంట్రుకల డైరెక్షన్ లోనే సమానంగా అప్లై చేయాలి. అప్లై చేసిన పది నుంచి పదిహేను నిమిషాల వరకూ వదిలేయండి. తరువాత వెచ్చని గుడ్డతో తుడుచుకోవచ్చు.

4) పసుపు, పంచదార, కార్న్ స్ట్రాచ్ మరియు గుడ్డులోని తెల్ల సోన
ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ షుగర్, అర టేబుల్ స్పూన్ కార్న్ స్ట్రాచ్, పావు టేబుల్ స్పూన్ పసుపును ఒక చిన్న గిన్నెలో కలుపుకోండి. కలుపుకున్న పేస్ట్‌ను పై వెంట్రుకలు ఉన్న డైరెక్షన్లో అప్లై చేసుకోండి. అలాగ పది నుంచి పదిహేను నిమిషాల వరకు వదిలేసి చివరిగా వెచ్చని గుడ్డతో తుడుచుకో వచ్చు.

ఈ సహజ పద్ధతుల్లో వాడటం వల్ల మీకు వెంటనే వాటి ప్రయోజనాలు కనిపించకపోవచ్చు. మీరు అధైర్య పడకుండా వాటిని వాడటం వదలకండి. మరి కొద్ది కాలంలో అవి మీకు ప్రయోజనాలు చూపిస్తాయి. పైన తెలిపిన పద్ధతులు మీరు వారానికి రెండు సార్లు వాడవచ్చు. మీ ముఖంపై వెంట్రుకలు గనుక దట్టంగా పెరుగుతుంటే, పైన తెలిపిన వాటిల్లో తేనె లేదా కోడిగుడ్డులోని తెల్ల సొన పద్ధతిని తప్పకుండా ప్రయత్నించండి





Untitled Document
Advertisements