ఎముకల దృఢత్వానికి మునగాకు!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:46 PM

ఎముకల దృఢత్వానికి మునగాకు!

మునగ చెట్టులో 360 రోగాలను నయం చేసే గుణం ఉన్నదని పూర్వీకుల నుండి నేటి పరిశోధకులు చెబుతున్నారు. పూర్వ కాలం నుండి కూడా మునగ కాయలను కూరలు సాంబారులో ఎక్కువగా వాడతారు. మునగ పువ్వులతో కూడా కూరలు వండుతారు. నాకు నువ్వు పప్పు లో వేస్తారు. మునగాకు నీ నీడలో ఆరబెట్టి పొడి నిల్వ ఉంచుకునే కూర దించిన తర్వాత కూడా రెండు మూడు చెంచాలు కలపవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మునగాకు పొడి కలిపి తాగవచ్చు. మునగ వాడటం వలన కాల్షియం బాగా అందుతుంది. మునగాకు లో విటమిన్ 'ఏ' కూడా ఉంటుంది అందుకే మునగలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
* మునగాకు లోని ప్రొటీన్లు పెరుగు లోని ప్రోటీన్ల కన్న రెండు రెట్లు ఎక్కువ.
* నారింజ లోని 'సి' విటమిన్ కన్నా ఏడు రెట్లు 'సి' విటమిన్ ఎక్కువ మునగాకులో ఉంటుంది.
* క్యాల్షియం మునగాకులో ఎక్కువ ఉన్నదని నిరూపించబడింది. ఔషధ గుణాలు ఆకులు ఎక్కువగా ఉంటాయి.
* దీనిని కూరగా చేసుకోవచ్చు, పచ్చడి చేయవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, మునగాకు సూప్ చేయవచ్చు. మునగాకు రసం ఎంతో బలవర్ధకమైనది. ఎముకలు దృఢంగా ఉంటాయి.





Untitled Document
Advertisements