క్రెడిట్ కార్డు వాడే వారికి అలర్ట్...ఇలా చేయొద్దు

     Written by : smtv Desk | Sat, Nov 27, 2021, 01:16 AM

క్రెడిట్ కార్డు వాడే వారికి అలర్ట్...ఇలా చేయొద్దు

క్రెడిట్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి వినియోగం నానాటికీ పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డుల వల్ల పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. అదేసమయంలో ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డు వాడే వారికి జాగ్రత్తగా ఉండాలి.

క్రెడిట్ కార్డు వాడే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కొన్ని పనులు అస్సలు చేయకపోవడమే ఉత్తమం. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. వీటిల్లో క్యాష్ విత్‌డ్రాయెల్ కూడా ఒకటి. క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు.

ఇలా చేస్తే అధిక వడ్డీ భారం పడుతుంది. ఇంకా క్యాష్ అడ్వాన్స్ ఫీజు చెల్లించుకోవాలి. మీరు డబ్బులు తీసుకున్న దగ్గరి నుంచి చెల్లించేంత వరకు వడ్డీ పడుతూనే వస్తుంది. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ పేమెంట్ కూడా చేయొద్దు. ఇలా చేస్తే 40 శాతం వరకు వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. రుణ ఊబిలో కూరుకుపోతారు.

Untitled Document
Advertisements