కొత్తరకం వేరియంట్‌తో ప్రపంచంలో ఆందోళన...ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో ఒమిక్రాన్ గుర్తింపు

     Written by : smtv Desk | Wed, Dec 01, 2021, 01:05 PM

కొత్తరకం వేరియంట్‌తో ప్రపంచంలో ఆందోళన...ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో ఒమిక్రాన్ గుర్తింపు

దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల్లో మొత్తం మూడు జన్యువులకు RT-PCR పరీక్షలను నిర్వహించాలని సూచించిస్తున్నారు. 'S'జన్యువు ఉందా? లేదా? అనేది గుర్తించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ.. కోవిడ్‌కు సంబంధించిన RT-PCR నివేదికలో 'N','S’,'E',‘ORF' జన్యువులు ఉంటాయన్నారు.

‘ఒక వ్యక్తిలో ‘S’జన్యువు లేకుండా మిగతావి పాజిటివ్‌గా సానుకూలంగా ఉంటే జన్యు విశ్లేషణ అవసరం లేకుండానే ఒమిక్రాన్ వేరియంట్ ఉందని పరోక్షంగా వెల్లడిస్తుంది.. దురదృష్టవశాత్తు RT-PCR పరీక్షలను నిర్వహించే అన్ని ల్యాబొరేటరీల్లో 'S' జన్యువును పరీక్షించడం లేదు’ అని పేర్కొన్నారు. ‘అన్ని ల్యాబొరేటరీల్లో అదనంగా 'S' జన్యువును పరీక్షించాలని త్వరలో మార్గదర్శకాలు రావచ్చు. 'S' జన్యువును గుర్తించడం వల్ల జీనోమ్ సీక్వెన్సింగ్ కంటే ముందుగా Omicron‌ను అంచనా వేయవచ్చు’ అన్నారు.

‘‘PCR పరీక్షల్లో ‘S' జన్యువును నిర్ధారణను చేసే దేశాలు Omicron జన్యు విశ్లేషణకు కూడా ఉపయోగించవచ్చు. అదే విధంగా జన్యు విశ్లేషణ అవసరం లేకుండా ఈ వేరియంట్‌ని పరీక్షించడానికి PCR పరీక్షలు అభివృద్ధి దశలో ఉన్నాయి’’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)పేర్కొంది

జాతీయ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రాహుల్ పండిట్ మాట్లాడుతూ.. ఓమిక్రాన్ ప్రమాదకారని జాగ్రత్త వహించడం చాలా కీలకమని అన్నారు. ‘‘SARS-CoV-2 వైరస్ పరిణామాలను టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG)నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీని ఆధారంగా Omicronను ఆందోళన కలిగించే వైరస్‌గా గుర్తించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహా ఇచ్చింది.. సభ్య దేశాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందజేస్తోంది.





Untitled Document
Advertisements