మొటిమలు ఎందుకు వస్తాయి?

     Written by : smtv Desk | Sat, Dec 11, 2021, 12:17 PM

మొటిమలు ఎందుకు వస్తాయి?

సాధారణంగా యుక్తవయస్సులోనే కాకుండా ఇవి 20 - 25 ఏళ్లవారిలోను ఎక్కువగా వస్తుంటాయి. కానీ 50 ఏళ్ళుదాటిన తరువాత కూడా కనిపిస్తుంటాయి. సాధారణంగా మొటిమలు రాకూడదనుకుంటే ఆయిల్ ఫ్రీగా ఉంచే క్లైన్సర్ వాడుకోవాలి. చర్మానికి రొజూ మాయిశ్చరైజర్ రాసుకోవటం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడుకుంటే అందులో ఉండే యాంటీ ట్రీటింగ్ వల్ల చర్మం బావుంటుంది.
ముఖం కడుకున్న 15 నిమిషాల తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కనీసం రెండుశాతం సైలిసైలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ ఉండే సాధనాలు వాడాలి. వాటివల్ల చర్మంలోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఇయర్ బడ్స్ మీద ఈ సొల్యుషన్ వేసి మొటిమలకు అంటించాలి. ఇలా చేయడం వలన మొటిమల్లో ఉన్న బ్యాక్టీరీయా మరో చోటికి రాకుండా ఉంటుంది. దీన్ని స్పాట్ ట్రీట్మెంట్ అని అంటారు. ఎక్కువ మొటిమలు ఉన్నప్పుడు స్క్రబ్ బదులుగా ఫేస్ మాస్క్ వాడుకోవాలి. ముఖం మీద మచ్చలు, గాయాల గీతలు ఉంటే స్క్రబ్ వాడకుండా ఉండటం మంచిది. సాధారణంగా టీనేజ్ లోనే భాధించే మొటిమలు వాటితో వచ్చే యాక్నె సమస్య ఇప్పుడు వాతావరణ కాలుష్యం కారణంగా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా రొజూ బయటకు వెళ్ళే వాళ్లకు సమస్య మరీ ఎక్కువ. అయితే ఈ మొటిమలను తొలగించుకోవడం కోసం ఎక్కువ సమయం, డబ్బు వెచ్చించకుండా ఇంట్లోనే కొద్దిగా శ్రమ పడితే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
* ముల్లంగిని మెత్తగా గ్రైండ్ చేసి అందులో రెండు తీ స్పూన్ల నిమ్మరసం, అంతే మోతాదులో టమాటో రసం కలిపి ముఖానికి పట్టించాలి. తర్వాత ఐదు నిమిషాల సేపు కొద్దిగా మంట అనిపిస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా ఒక వారం రోజుల పాటు రోజుకొకసారి చేస్తే మొటిమలు, వాటి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తగ్గుతాయి.
* మొటిమలు తగ్గినా కూడా వారానికొకసారి ఈ ప్యాక్ వేస్తే చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. మొటిమలు, యాక్నె రాకుండా తేటగా ఉంటుంది.
* ముల్లంగిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. 20 ఎం.ఎల్ రసానికి అంతే మోతాదులో మజ్జిగ కలిపి ముఖానికి పట్టించాలి. ఒక గంటసేపటి తర్వాత ముఖాన్ని వేడి నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మగ్రంధుల నుంచి విడుదలయ్యే అదనపు జిడ్డును తొలగించి బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. ఇలా వారం చేస్తే కొత్త మొటిమలు రావు. అప్పటికే ఉన్నవి కూడా రాలిపోయి చర్మం నునుపుగా మారుతుంది.





Untitled Document
Advertisements