దంపుడు బియ్యంతో ఆరోగ్యం!

     Written by : smtv Desk | Mon, Dec 13, 2021, 03:55 PM

దంపుడు బియ్యంతో ఆరోగ్యం!

మన పూర్వీకులు మొత్తం దంపుడు బియ్యాన్నే తినేవారు. 100 సంవత్సరాలు హాయిగా జీవించేవారు. వారికి నరాల బలహీనత లేదు, తిమ్మిర్లు లేవు, బలహీనతలేదు కారణం వారు దంపుడు బియ్యం తినడమే. పూర్వకాలంలో వడ్లను రోకలితో దంచి బియ్యంగా మార్చేవారు. అందుకే దంపుడు బియ్యం అనే పేరు వచ్చింది. వడ్ల మిల్లులు వచ్చినప్పటి నుండి బియ్యాన్ని తెల్లగా పట్టించి, దానిలో సారం లేకుండా పోతుంది. ఇప్పటి రోజులలో దంచేవారు లేరు కాబట్టి, వడ్ల మిల్లులో సింగిల్ పాలిష్ బియ్యాన్ని తీసుకోవాలి. అవి దంపుడు బియ్యం లాగే ఉంటాయి. అన్ని పోషకాలు వుంటాయి. ఈ బియ్యాన్ని వండుకొని తినవచ్చు. ఇసురాళ్ళ మీద ఇసిరి రవ్వ ఇడ్లీ, ఉప్మా చేసుకోవచ్చు. జల్లెడ పట్టి మెత్తటి పిండితో రొట్టె చేసుకోవచ్చు. ఈ బియ్యంలో పైటోస్టిరాల్స్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుతో పాటు సేలీనీయం అధికంగా లభిస్తాయి. అందుకని ఆలస్యంగా జీర్ణం అవుతాయి. ఇది షుగర్ ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనత తగ్గిస్తుంది. అలసట దూరం చేస్తుంది. ఒక కప్పు దంపుడు బియ్యంలో క్యాలరీలు-17 గ్రాములు, కొవ్వు- 1.8 గ్రాములు, సాచురేటెడ్ కొవ్వు-0. 4 గ్రాములు, మొనోఅన్ సాచురేటేడ్ కొవ్వు-0.6, పీచు-3.5, ప్రోటీన్లు-5 గ్రాములు, కార్బోహైడ్రేట్లు- 45 గ్రాములు, కొలస్ట్రాల్-0, సోడియమ్-10 గ్రాములు, ఎం.జి.మ్యంగనీస్-1.8 మిల్లిగ్రాములు, మెగ్నీషియం-84 మిల్లిగ్రాములు, పాస్పరస్-162మిల్లిగ్రాములు, సేలీనీయం-19 మిల్లిగ్రాములు ఉంటాయి.
మరి ఇన్ని పోషకవిలువలు కలిగి ఉన్న దంపుడు బియ్యం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆలస్యం ఎందుకు? ఇకమీదట మీ ఆహారంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకోవడం మరిచిపోకండి.





Untitled Document
Advertisements