రుచికరమైన ఉలవచారు రెసిపి!

     Written by : smtv Desk | Fri, Dec 24, 2021, 12:55 PM

రుచికరమైన ఉలవచారు రెసిపి!

సాధారణంగా తెలుగు లోగిళ్ళలో ముద్దపప్పు, రసం, ఆవకాయ, నెయ్యి, అప్పడం వీటికి ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రసం అనేది ప్రతి ఇంట్లోనూ రోజు తప్పకుండా ఉండాల్సిందే. చింతపండు రసం, మిరియాల రసం, ధనియాల రసం, టమాటో రసం, నువ్వుల రసం, సాంబార్, పప్పుచారు ఇలా రోజుకో రకమైన రసం తాయారు చేయడంలో మన తెలుగింటి ఆడపడుచులు సిద్దహస్తులు. అయితే రసాలు అన్నిటిలోకి ప్రత్యేకమైనది నోరూరించే ఉలవచారు , దీన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఉలవలు ఒంటికి బలాన్ని చేకుర్చడంతో పాటు చలికాలంలో ఒంటికి ఉష్ణాన్ని అందిస్తాయి. అయితే ఈ ఉలవలు, ఉలవచారు అధికంగా తీసుకుంటే వేడి చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే మితంగా తీసుకోవడం ఉత్తమం. ఐరన్ లోపం ఉంటే ఉలవచారు తినడం చాలా మంచిది. టేస్ట్ తో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉలవచారుతో కలుగుతాయి. ఉలవచారును చేసిన రోజు కంటే తెల్లవారి తింటే చాలా రుచిగా ఉంటుంది. మనలో ఉన్న ఐరన్ లోపాన్ని సవరించేందుకు ఈ రసం చాలా గొప్ప వంటకం. ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ రసాన్ని చేసిన రోజు తెల్లవారి తినడం వలన మరింత రుచిగా ఉంటుంది.

ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:-
1 కప్ ఉలవలు 2 గంటలపాటు నానబెట్టినవి
2 కప్పుల నీళ్ళు
1/2 కప్ తురిమిన కొబ్బరి
1 ఉల్లిపాయ
2 స్పూన్లు నూనే
1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు
చిటికెడు ఇంగువ
6 వెల్లుల్లి రెబ్బలు
5 ఎండుమిర్చి
2 రెమ్మల కరివేపకు
1 1/2 టీ స్పూన్ రసం పొడి
అవసరాన్ని బట్టి ఉప్పు
1 టీ స్పూన్ బెల్లం
2 టేబుల్ స్పూన్ చింత పండు
1 చేతి నిండా కొత్తిమీర

తయారీవిధానం:-
ప్రెషర్​ కుక్కర్ లో ఉలవలు మరియు నీరు పోసి నాలుగైదు విజిల్స్​ వచ్చేంత వరకు వాటిని ఉడికించాలి. ఉలవచారు రెసిపీని తయారు చేసుకోవడానికి ఉలవలను మొదటగా ఉడకబెట్టడం చాలా ఇంపార్టెంట్​.
ఒక గ్రైండర్​ లో ఎండు కొబ్బరిని వేసి అందులో ఉల్లిగడ్డ మరియు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలను అందులో వేసి గ్రైండ్​ చేయాలి. ఈ మూడు పదార్థాల మిశ్రమం బాగా మిక్స్​ అయ్యేంత వరకూ గ్రైండ్​ చేసుకోవాలి.
స్టవ్​ మీద ఒక ప్యాన్​ ను పెట్టి వేడి చేయాలి. అనంతరం ఆ ప్యాన్​ లో ఆయిల్​ ను పోసి వేడి చేసుకోవాలి. ప్యాన్​ లో పోసిన ఆయిల్​ వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి, అవి కాస్త రంగు మారిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేయాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేగిన తర్వాత పసుపు మరియు ఇంగువ వేయాలి. అనంతరం అందులో రెండు గ్లాసుల నీటిని ప్యాన్ లో పోసి మనం ముందుగా గ్రైండ్​ చేసిన ఉల్లిగడ్డ మరియు ఉడకబెట్టిన ఉలవలను వేసి కలుపుకోవాలి. ఇలా ప్యాన్​ లో వేసిన అన్ని పదార్థాలు బాగా మిక్స్​ అయ్యేలా కలుపుకోవాలి.
మనం ప్యాన్​ లో పోసిన నీరు రసంలా మారి వేడి అయిన తర్వాత ఆ రసానికి రసం పౌడర్​ ను కలుపుకోవాలి. రసం పౌడర్​ తో పాటు చింతపండు గుజ్జును కూడా ఆ రసానికి కలపాలి. బెల్లం కావాలనుకున్న వారు బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇక చివరగా రసంలో ఉప్పు వేసి మరగబెట్టాలి. రసం చిక్కగా అయిన తర్వాత మనం ప్యాన్​ ను స్టవ్​ మీది నుంచి దించే ముందు ఆ రెసిపీలో కొత్తిమీర ఆకులను వేసుకుంటే రసం టేస్టే మారిపోతుంది. దించిన తర్వాత రసాన్ని అన్నంతో పాటు కలుపుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ రసాన్ని ఫ్రిడ్జ్​ లో స్టోర్​ చేసుకుని తెల్లవారిన తర్వాత తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా రసాన్ని చాలా సింపుల్​ స్టెప్స్​ లో తయారు చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements