వరుసగా రెండోవ రోజు దిగివచ్చిన బంగారం, వెండి ధరలు!

     Written by : smtv Desk | Wed, Jan 05, 2022, 10:44 AM

వరుసగా రెండోవ రోజు దిగివచ్చిన బంగారం, వెండి ధరలు!

గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతూనే వచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా దిగివచ్చింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2 రోజుల్లో రూ. 610 మేర దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 48,990కు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో 10 గ్రాములకు రూ. 560 పడిపోయింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 44,900కు క్షీణించింది.
బంగారం రేటు మాదిరిగానే వెండి ధర కూడా తగ్గి వెండి రేటు 2 రోజుల్లో రూ. 900 మేర పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 65,700కు దిగొచ్చింది. బంగారం, వెండి ధరల తగ్గింపు నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది ఊరట కలిగించే విషయం అనే చెప్పుకోవాలి.





Untitled Document
Advertisements