గర్భధారణకు ఏ వయసు అనువైనది!

     Written by : smtv Desk | Wed, Jan 05, 2022, 10:47 AM

గర్భధారణకు ఏ వయసు అనువైనది!

చాలావరకు మధ్యతరగతి తల్లిదండ్రులు వివాహానికి సరైన సమయం రాకముందే ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు వెంటనే గర్భం ధరించడం వలన రక రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే స్త్రీలకు గర్భం ధరించడానికి అనువైన సమయం అది అంటే స్త్రీలు 25 సంవత్సరాలు నిండిన తర్వాత గర్భం దాల్చడం మంచిది. ఇంతకంటే తక్కువ వయసులో గర్భం రావడం వల్ల తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. 16 నుండి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసులో గర్భం దాల్చినట్లు అయితే తల్లి ఆరోగ్యం చెడటమే కాకుండా బిడ్డ కూడా బలహీనంగా పుడుతుంది. తక్కువ వయసులో గర్భం దాల్చిన స్త్రీలలో గర్భస్రావాలు అవ్వడం ఎక్కువ. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా కాన్పు అవడం జరుగుతుంది. 30 సంవత్సరాలు దాటిన స్త్రీలు గర్భం ధరించినట్లయితే జన్యు సంబంధమైన లోపాలు పిల్లల్లో కనబడే అవకాశం ఉంది. ముఖ్యంగా "డాన్ సిండ్రోమ్" కలిగిన పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అందుకని 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గర్భం దాల్చడానికి మంచి వయస్సు.





Untitled Document
Advertisements