జగన్ ప్రభుత్వం నచ్చలేదంటే మీరు అధికారం నుంచి దిగిపోతారా..ఆర్జీవీ!

     Written by : smtv Desk | Wed, Jan 05, 2022, 10:59 AM

జగన్ ప్రభుత్వం నచ్చలేదంటే మీరు అధికారం నుంచి దిగిపోతారా..ఆర్జీవీ!

గతకొంతకాలంగా సినిమా టికెట్ రెట్ల తగ్గింపు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని పలువులు సినిప్రముఖులు ప్రశ్నిస్తున్నారు..అదే బాటలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రెండు మూడురోజులుగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం వైసీపీకి అనుకూలంగా ఉండి ఏపీ సిఎంను నెత్తిన పెట్టుకొని వారికి అనుకూలంగా పలు చిత్రాలు కూడా చేసిన వర్మ ఇప్పుడు ఇలా ప్రశ్నిస్తూ చేస్తున్న వ్యాఖ్యాలు వైరల్ అవుతున్నాయి.
నిన్న వైసీపీ సర్కార్ కు 10 ప్రశ్నలంటూ వేసి వర్మ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏపీసిఎం ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జగన్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు.
చూసిన మూవీ నచ్చకపోతే ప్రేక్షకులకు తిరిగి డబ్బులు చెల్లిస్తారా? అని నిన్న ఏపీ మంత్రి పేర్ని నాని లైవ్ డిబేట్ లో వర్మకు కౌంటర్ ఇచ్చారు. దీనికి వర్మ సైతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తనకు జగన్ ప్రభుత్వం నచ్చలేదంటే మీరు అధికారం నుంచి దిగిపోతారా? అని ప్రశ్నించారు.
ఆర్జీవీ వరుస ప్రశ్నలకు తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించి రాంగోపాల్ వర్మపై విరుచుకుపడ్డారు. వర్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. పక్కరాష్ట్రంలో ఉండి ఆంధ్రా గురించి ఏమైనా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటేనని మంత్రి కొడాలి నాని కుండబద్దలు కొట్టారు.
జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న ఆర్జీవీకి మెగా ఫ్యామిలీ నుంచి కూడా మద్దతు లభించింది. వర్మకు ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలికారు. వర్మ 10 ప్రశ్నల వీడియోను ట్వీట్ చేశారు. వర్మ చెప్పింది అక్షరాల నిజమన్నారు. తాను అడగాలనుకునే ప్రశ్నలనే ఆర్జీవీ అడిగారంటూ నాగబాబు వెల్లడించారు. నాగబాబుకు ఆర్జీవీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆర్జీవీ తిరుగుబాటు వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.





Untitled Document
Advertisements