నింగిలోని సూర్యున్ని భువికి తెచ్చిన చైనా!

     Written by : smtv Desk | Sat, Jan 08, 2022, 12:14 PM

నింగిలోని సూర్యున్ని భువికి తెచ్చిన చైనా!

కాలం గడిచేకొద్ది ప్రపంచంలో అభివృద్ధి వేగవంత అవుతుంది. మానవుడు తన దైన శైలిలో ప్రతి దానిని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకి నడుస్తున్నాడు. ఈ క్రమంలోనే పొరుగు దేశం చైనా సాంకేతికతలో మరో సరికొత్త అడుగు ముందుకు వేసింది. అంతరిక్షంలోకి వెళ్లకుండా సూర్యుడు నేల మీదకు తెచ్చింది. అదేటి అని అనుకుంటున్నారు. అవును. మీరు విన్నది నిజమే. డ్రాగన్ ఇటీవల ఓ ప్రయోగం చేపట్టింది. దీంతో ఏకంగా సూర్యుడిని భూమి మీదకు తీసుకు వచ్చింది. అభివృద్ధి చెందిన సాంకేతికతో కృత్రిమంగా సూర్యుడ్ని సృష్టించింది. ఈ ప్రయోగంతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది చైనా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు.. చైనా కృత్రిమ సూర్యుని తయారు చేసింది. సాధారణంగా భానుడి దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతను సృష్టించారు. ఈ ఉష్ణోగ్రత సుమారు 5 రెట్లు కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. కృత్రిమ సూర్యుడి ప్రాజెక్టు విజయవంతం తో సాంకేతిక చరిత్రలో చైనా మరో కీలక మైలు రాయిని దాటినట్లు అయ్యింది.
సాధారణంగా సూర్యుడి దగ్గర కేవలం 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. కానీ చైనా కృత్రిమంగా తయారు చేసిన సూర్యుడి దగ్గర సుమారు 70 మిలియన్ డిగ్రీల వేడి ఉంటుందని ఈ ప్రాజెక్టులో భాగమైన పరిశోధకులు చెబుతున్నారు. ఈ భారీ స్థాయి ఉష్ణోగ్రత కూడా కేవలం 1056 సెకండ్లలోనే ఉత్పత్తి చేయడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే భానుడి దగ్గర కంటే చైనా రూపొందించిన సూర్యుని దగ్గర హీట్ సుమారు ఐదు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సూర్యుడిని నుంచి భారీ స్థాయిలో ఉష్ణోగ్రత వెలుబడే అందుకు తాము చాలా కష్టపడాల్సి వచ్చిందని ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ను చైనా చేపట్టేటప్పుడు చాలా దేశాలు విజయవంతం అవుతుంది అని భావించలేదు. కానీ డ్రాగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ ప్రాజెక్టు ఇంత సక్సెస్ కావడానికి చైనా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది.





Untitled Document
Advertisements