ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్...

     Written by : smtv Desk | Tue, Jan 02, 2018, 12:42 PM

ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్...

ఇస్లామాబాద్, జనవరి 02 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. గత 15 ఏళ్లుగా 33 బిలియన్ డాలర్ల సహాయాన్ని పాకిస్థాన్‌కు అందజేసిన, ఆ దేశం మాత్రం మా నేతలనుమూర్ఖులుగా భావిస్తూ, అబద్ధాలు, మోసాలు తప్ప మాకు ఇచ్చిందేమీ లేదని ట్రంప్ ట్వీట్‌ చేశారు. అయితే, దీనిపై పాకిస్థాన్ ఘాటుగా స్పందించి, పాక్‌ విదేశాంగ కార్యాలయం అమెరికా రాయబారికి సమన్లు పంపినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది. ఈ అత్యవసర సమావేశానికి సంబంధించి అజెండాను వెల్లడించలేదు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై పాక్‌ రక్షణ, సమాచార మంత్రులు కూడా ట్విట్టర్‌ ద్వారా విమర్శలు చేశారు. అమెరికాకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం, అంటూ ప్రపంచానికి నిజాలు తెలిసేలా చేస్తామని పాక్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ తెలిపారు. కాగా, పాక్ కు 255 డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపివేసింది.





Untitled Document
Advertisements