కిమ్ కు అమెరికా వైట్‌హౌస్‌ విమర్శలు

     Written by : smtv Desk | Thu, Jan 04, 2018, 12:09 PM

 కిమ్ కు అమెరికా వైట్‌హౌస్‌ విమర్శలు

వాషింగ్టన్‌, జనవరి 4 : అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ నిర్వహించిన సమావేశంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై విమర్శలు చేసింది. అమెరికాపై పలు హెచ్చరికలు చేసిన ఉత్తరకొరియాకు ట్రంప్ ఎప్పటికప్పుడు బెదిరిపోకుండా తిరిగి సమాధానమిస్తున్నారు.

అంతేకాకుండా అణు దాడి చేస్తామని, అణు బటన్‌ నా టేబుల్‌పైనే ఉందని కిమ్‌ తరుచూ హెచ్చరికలు చేయడంతో, మానసిక ఆరోగ్యం గురించే మనం ఆందోళన పడాల్సి ఉందని ట్రంప్ అన్నారు. కాగా, మన అధ్యక్షుడు భయపడిపోయే, బలహీనమైన వ్యక్తి కాదని, వాగ్దానాలను నిలబెట్టుకుంటారని, అమెరికా ప్రజల రక్షణ కోసం కృషి చేస్తారని శాండర్స్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements