జైలులో క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విధులు ఇలా..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 04:44 PM

జైలులో క్రికెటర్ నవజ్యోత్  సింగ్ సిద్ధూ విధులు ఇలా..

టీమ్ ఇండియా మాజీ క్రికెట్ ఆటగాడు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దు దాదాపుగా 30 ఏళ్ల క్రితం సిద్దు మరియు అతని స్నేహితుడు కలిసి రోడ్డు మీద ఒక వృద్దుడిని చితకబాదారు. అయితే ఆయన అక్కడికక్కడే మరణించడం తో పరిస్థితి ఇప్పటి వరకు వచ్చింది. అప్పట్లో ఈ కేసులో అయితే బాదితుని కుటుంభ సభ్యులు కోర్టుకు ఎక్కడంతో 1999లో సిద్దు మరియు అతని స్నేహితునికి కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధించి నిర్దోషులుగా ప్రకటించింది.అయితే భాదితుల కుటుంబం మాత్రం అసలు తగ్గకుండా సుప్రీమ్ కోర్టులో రివ్యూ పెటిషన్ వేయడం తో క్రికెటర్ సిద్దుకు మల్లి చుక్కెదురైంది . అయితే ఈ కేసు విషయంలో విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు రివ్యూ జరిపి నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఒక సంవత్సర కాలం పాటు జైలు శిక్షను విధించింది. అయితే నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ లొంగిపోయిన అనంతరం జైలులో తీసుకున్న ఆహారానికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. అయితే సిద్ధూ కోలుకున్న తర్వాత అతనికి శిక్షలో భాగంగా జైలులో క్లర్క్ విధులను నిర్వర్తించాల్సిందిగా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే సిద్ధూ 25 వ తారీఖు నుండి తన విధులను చేస్తున్నట్లుగా వెల్లడైంది. అయితే పార్టీ అలా జైలు రూల్స్ ప్రకారం నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కు మూడు నెలల పాటు ఇలాంటి శాలరీ ఇవ్వకుండా మూడు నెలల తర్వాత రోజుకు 30 నుంచి 90 రూపాయల మధ్యలో అధికారుల నిబంధనల ప్రకారం కేటాయిస్తారని వెల్లడవుతుంది.





Untitled Document
Advertisements