సరికొత్త వ్యూహలతో ముందుకొస్తున్నాం : చంద్రబాబు

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 05:39 PM

సరికొత్త వ్యూహలతో ముందుకొస్తున్నాం  : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కార్యక్రమం ఒంగోలులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జ్యోతిప్రజ్వలన చేసి ఈ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అయితే ఈ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన అందరూ కార్యకర్తలకు మొదటగా నివాళులు అర్పించారు . అయితే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల కోసం పని చేసిన వారికే రాబోయే ఎన్నికలలో సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు అంతే కాకుండా రాబోయే ఎన్నికలలో 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తామని ప్రకటించడం జరిగింది దీని వల్ల తెలుగుదేశం పార్టీకి సరికొత్త రక్తాన్ని గుర్తించి గెలుపు దిశగా ప్రయత్నిద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లో సరికొత్త ఉత్సాహంతో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం సాగనుంది. అయితే మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ హాజరు అయ్యి సభను విజయవంతం చేశారు. కరుణ పాండమిక్ అనంతరం మహానాడు కార్యక్రమం మొదటిది కావడం తో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ఏర్పాట్లు చేసింది .

Untitled Document
Advertisements