బాలయ్య ఆధ్వర్యంలో నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 10:48 AM

బాలయ్య ఆధ్వర్యంలో నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు కృష్ణాజిల్లాలో ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా నిమ్మకూరు లో ఏర్పాటుచేసిన శత జయంతి ఉత్సవాలకు నందమూరి తారక రామారావు గారి పుత్రుడు హిందూపురం శాసనసభ సభ్యులు నందమూరి బాలకృష్ణ హాజరయ్యే వేడుకలను ప్రారంభించారు. తారక రామారావు విగ్రహానికి పూలమాల తో నివాళులు అర్పించి తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరవడం వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. బాలకృష్ణ ఈ సమావేశంలో మాట్లాడుతూ నందమూరి తారకరామారావు ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల పై ఎప్పటికీ ఉంటాయని తెలుగు ప్రజలు ఆయన స్థాయి మరచిపోలేని దని ఎన్టీఆర్ ను కీర్తించారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలన్నా ఎన్టీఆర్ గారి కోరికను గుర్తుచేసుకుంటూ ఆయన పై ఎంతో అభిమానం చూపిన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాలయ్య బాబు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

Untitled Document
Advertisements