తుస్సుమన్న జగనన్న బస్సుయాత్ర..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 12:36 PM

తుస్సుమన్న జగనన్న బస్సుయాత్ర..

సామాజిక న్యాయం అంటూ జగనన్న భరోసా వైసిపి తాము ప్రవేశపెట్టిన పథకాలను గురించి ప్రచారానికి న బస్సు యాత్ర ప్రారంభమైంది. అయితే దీనిలో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సామాజిక న్యాయం చేకూర్చింది . ఆయా వర్గాల కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది అనే అంశంపై వేసినా.. ఆ పథకాల లోని అవినీతిపై తెలుగుదేశం పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్న బాదుడే బాదుడు ఈ కార్యక్రమానికి కౌంటర్ గా సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర ప్రారంభం అవ్వగానే విజయనగరం జిల్లాలో బస్సు యాత్ర ఆగిపోయింది. అనుకోకుండా ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు బలమైన గాలులు వీయడం వలన బస్సు యాత్ర రద్దయింది. దీంతో బస్సు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే విజయనగరంలో వైసిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభం అయ్యేది ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే వారం రాజమహేంద్రవరంలో బహిరంగ సభలో కూడా మంత్రులు వైసిపి నాయకులు వచ్చే సమయానికి సభకి వచ్చినచాలామంది ప్రజలు వెళ్లిపోయారు పార్టీ నాయకులు మంత్రులు ప్రసంగించే సమయానికి ఎవరూ లేకపోవడం ఖాళీ కుర్చీలు మాత్రమే కనబడటం వల్ల వైసిపి బస్సుయాత్ర తుస్సుమన్నట్లుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

Untitled Document
Advertisements