నిద్రలో కలలు వస్తున్నాయా.. అసలు కారణం ఏంటంటే?

     Written by : smtv Desk | Mon, Jun 20, 2022, 05:55 PM

నిద్రలో కలలు వస్తున్నాయా..  అసలు కారణం ఏంటంటే?

మన జీవితంలో ఏం జరగాలి,. ఏం జరగకూడదని బలంగా కోరుకుంటామో, అవే కలలు కనటం ద్వారా అనుభూతి చెందుతాం. చిన్ననాటి జ్ఞాపకాలు మరియు మనం పడుకునే ముందు ఎం ఆలోచించుకుంటా నిద్రపోతమో అవే వారి కలలపై ప్రభావం చూపుతాయి
కలలు రావటమనేది సహజం. అయితే ఇందులో కొన్ని కలలు మనకు గుర్తు ఉంటాయి. కొన్ని మనకు గుర్తు ఉండవు. కొన్ని కలలు సగంలో ఆగిపోతాయి. కొన్ని సార్లు కలలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటాయి. కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం కలలుసాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో, శరీరం రెండు దశల్లోకి వెళుతుంది. మొదటిది, ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్. ఈ దశలో మెదడులోని ఆలోచనలు పూర్తిగా స్తంభిస్తాయి
కలలు ర్యాపిడ్ మూవ్ మెంట్ దశలో మాత్రమే వస్తాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా కొన్ని సార్లు కలలు వస్తాయి, కానీ అవి మేల్కొనే సమయానికి గుర్తుండవు. ఒక సగటు మనిషికి, నిద్రలో సుమారు ఆరు కలల వరకూ వస్తాయి. ఒక వ్యక్తి భావోద్వేగాలకు అనుకూలంగానే, వారికి కలలు రావడం జరుగుతుందని పరిశోధకులు చెబుతారు. ఒక్కొక్కసారి మనం ఎప్పుడో ఒకసారి చూసిన మనుషులు కూడా కలలోకి వస్తూ ఉంటారు. కొన్ని సార్లు మనకు పీడ కలలు వస్తే, కొన్నిసార్లు మంచి కలలు వస్తాయి.

మన జీవితంలో ఏం జరగాలి, ఏం జరగకూడదని బలంగా కోరుకుంటామో, అవే కలలు కనటం ద్వారా అనుభూతి చెందుతాం. చిన్ననాటి జ్ఞాపకాలు కూడా, వారి కలలపై ప్రభావం చూపుతాయి. మనిషి తన రోజు వారి దినచర్యలో ఎదుర్కొన్న సంఘటనలు, ఎక్కువగా ఆలోచించిన ఆలోచనలు కలల రూపంలో వస్తాయి. కొంత మంది కలల ద్వారా భవిష్యత్తు చూడగలుగుతారు. ఒక మనిషి సున్నిత మనసు అయితే, లేదా ప్రతి చిన్న విషయానికి భయపడేవారు అయితే వారికి పీడకలలు, లేదా భయంకరమైన కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

కలలు మన భవిషత్తులో రాబోయే ఆపదలను ముందుగానే మనకి చూపిస్తాయని, అవి చూపించినట్లే మన జీవితం కూడా ఉంటుందని చాలా మంది నమ్మతుంటారు. భవిష్యత్తు గురించి అంచనా వేసుకునే వారు అయితే జరగబోయే వాటిని ముందు కలలో చూడగలుగుతారు. యోగ శాస్త్రం ప్రకారం కలలు అనేవి మనిషి శరీరంలో చక్రాలపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా భయపెట్టే విషయాలు నిరంతరం మెదడుని ఒత్తిడికి గురి చేసి, నిద్రలో పీడకలలని సృష్టించేలా చేస్తాయి..





Untitled Document
Advertisements