ఐటీడీఏ ఆర్ధిక భరోసా.. చేప పిల్లల పంపిణీతో ఉపాధి

     Written by : smtv Desk | Wed, Jun 22, 2022, 12:22 PM

ఐటీడీఏ ఆర్ధిక భరోసా.. చేప పిల్లల పంపిణీతో ఉపాధి

ఇప్పటివరకు ములుగు జిల్లాలో 16 సొసైటీలను, మహబూబ్ బాద్లో 8 సొసైటీలు, వరంగల్ పరిధిలో 5 సొసైటీలను ఏర్పాటు చేశారు. సొసైటీ సభ్యులకు 60 శాతం రాయితీలతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చేపలు అమ్మెందుకు సంచార వాహనాలు, వలలు అందిస్తున్నారు ఐటీడీఏ అధికారులు
ఇంకా చదవండి ... ఈక్రమంలో ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో మొత్తం మూడు జిల్లాలు ఉన్నాయి. ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు స్థానిక ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాలన్నిటిలోనూ గిరిజన మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి ఐటీడీఏ అధికారులు, వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి ఆయా సొసైటీల ద్వారా గిరిజన మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. చేపల పెంపకంతో ఏజెన్సీలోని గిరిజన మత్స్యకారులకు ఆర్థిక భరోసా కలిగిస్తుంది ప్రభుత్వం.మత్స్యశాఖ సహకారంతో గతేడాది వాజేడు వెంకటాపురంలోని ట్రైబల్ సొసైటీకి 3,60,000 చేప పిల్లలను పంపిణీ చేశారు. 2022-23 సంవత్సరానికి గానూ ములుగు . జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక కోటి 60 లక్షలకు పైగా చేప పిల్లలు వచ్చే అవకాశం ఉందని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన మత్స్య పారిశ్రామిక సొసైటీలకు ఎక్కువ సంఖ్యలోనే చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. పంపిణీ చేసిన చేప పిల్లలను స్థానికంగా ఉండే చెరువులలో పెంచుకొని గిరిజన మత్స్య పారిశ్రామిక సొసైటీలు లాభాలకు క్రయ విక్రయాలు జరపవచ్చు. దీని ద్వారా తమ కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..గిరిజనులకు స్వయం ఉపాధి కల్పిస్తూ వారికీ ఆర్ధిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. ములుగు, మహబూబాబాద్, వరంగల్ పరిధిలోని ఏజెన్సీ ఏరియాలో షెడ్యూల్ తెగలకు చెందిన వారికి ఈ సొసైటీల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పెస యాక్ట్ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గిరిజనులకు అవగాహన కల్పించి ఈ సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటుగా రాబోయే కాలంలో గిరిజన మహిళ సహకార మార్కెటింగ్ సొసైటీలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఐటీడీఏ అధికారులు. ఇప్పటివరకు ములుగు జిల్లాలో 16 సొసైటీలను, మహబూబాబాద్ లో 8 సొసైటీలను, వరంగల్ పరిధిలో 5 సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ సభ్యులకు 60 శాతం రాయితీలతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చేపలు అమ్మేందుకు సంచార వాహనాలు, వలలు తదితర వస్తువులు ఐటీడీఏ అధికారులు అందజేస్తున్నారు .





Untitled Document
Advertisements