10రూ.కే బిర్యానీ.. ఎక్కడో తెలుసా..

     Written by : smtv Desk | Thu, Jun 23, 2022, 01:10 PM

10రూ.కే బిర్యానీ.. ఎక్కడో తెలుసా..

బిర్యానిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు .రోజు బిర్యానిని తినే వారు కూడా చాలామంది ఉంటారు. సిటీలలో ఎక్కువమంది తినే ఫుడ్ కూడా బిర్యానినే.చికెన్ ముక్కలతో ఉల్లిపాయలు నంజుకుంటూ తింటే ఆ మజానే వేరు. ఇక బిర్యాని తింటూ కూల్ డ్రింక్ తాగుతుంటే చల్లగా భలే ఉంటుంది.ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటే బిర్యాని తప్పనిసరిగా ఉంటుంది. అలాగే కుటుంబంతో రెస్టారెంట్ కి వెళ్ళిన బిర్యాని నే ఎక్కువుగా తింటూ ఉంటారు .
అయితే బిర్యాని ధరలు ఒక్కొక ప్రాంతంలో ఒకలా ఉంటాయి.హోటల్ ని బట్టి కూడా మారుతూ ఉంటాయి.ఫై స్టార్ హోటల్ లో బిర్యాని రూ.500 వరకు ఉంటుంది.ఇక మాములు ఏసీ హోటల్ లో అయితే రూ.300 వరకు ఉంటుంది.అదే కర్రీ షాపుల్లో అయితే రూ.100కే లభిస్తుంది.ఇక కొన్నిచోట్ల రూ.90, రూ.80కే ప్లేట్ బిర్యాని ఇస్తారు.అయితే రూ.10కే బిర్యానని ఇవ్వడం ఎక్కడైనా చూశారా.. అవును రూ.10కు కప్పు టీ వస్తుంది.అయితే రూ.10కు టీ నే కాదు.రుచికరమైన బిర్యాని కూడా వచ్చేస్తోంది.ఇంతకు ఈ రూ.10 బిర్యాని ఎక్కడో కాదు.హైదరాబాద్ లోని అప్ఝల్ గంజ్ బస్టాండ్ లో ప్రాంతంలో ఇప్తెకార్ అనే పెద్దాయన రూ.10కే బిర్యానని ఇస్తున్నాడు.బేగం బజార్, ఉస్మానియా ఆస్పత్రికి వచ్చేవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఈయన దగ్గర నుంచి పార్శిర్లు కూడా తీసుకెళ్తున్నారు .రోజుకు నాలుగు పెద్ద కంటైనర్లలో 60 కిలోల బిర్యాని అమ్ముతున్నారు.ధర తక్కువ కావడంతో జనం ఎగబడుతున్నారు.రూ.10 బిర్యాని అంటే టేస్ట్ బాగోదని చాలామంది అనుకుంటారు.కానీ ఈయన రుచిలో తగ్గడం లేదు.రెస్టారెంట్ లలో ఉన్నట్లే ఉంటుది.కానీ రూ.10కి ఇచ్చేది చికెన్ బిర్యాని లాగే ఉండే వెజ్ బిర్యాని.
వెజ్ బిర్యాని లాగా క్యారెట్లు, గ్రీన్ పీస్, బంగాళదుంపలు, బీన్స్ వంటివి అన్నీ వేస్తున్నాడు.ఇప్తెకార్ తో పాటు అతని అన్నదమ్ములు కూడా ఇందులో భాగస్వామం అవుతున్నారు. అందరూ కలిసి రెస్టారెంట్ ని నడుపుతు రోజుకు 1500 ప్లేట్ల బిర్యానీ అమ్ముతున్నారు





Untitled Document
Advertisements