ఈ నాలుగు లక్షణాలతో ఉన్న భార్య వస్తే...

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 08:59 PM

ఈ నాలుగు లక్షణాలతో ఉన్న భార్య వస్తే...

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో స్త్రీల లక్షణాలను వివరిస్తూ.. వారికి ఉన్న 4 లక్షణాల వల్ల భర్తలు అదృష్టవంతులు అవుతారని వివరించారు. ఇంతకీ ఏమిటా లక్షణాలు..
సహనం:ఆచార్య చాణక్యుడు చెప్పిన మొదటి గుణం సహనం. ఈ గుణం ఉన్న స్త్రీలు తమ కుటుంబాన్ని భర్తను మధ్యలో వదిలిపెట్టరు. అలాంటి స్త్రీలు ప్రతి విషయంలోనూ భర్తతో కలిసే ఉంటారు. వారికి సహాయం చేస్తారు.
సంస్కారవంతం:నీతి శాస్త్రాల ప్రకారం విద్యావంతులైన, సంస్కారవంతమైన స్త్రీలు తప్పొప్పులను గుర్తించే అవగాహన కలిగి ఉంటారు. అలాంటి స్త్రీలు తమ పిల్లలను కూడా సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అంతేకాదు అటువంటి ఆడవారు ఉన్న ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది.
డబ్బు ఆదా:డబ్బును ఆదా చేసే స్త్రీ భార్యగా దొరికిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు. కష్ట సమయాల్లో డబ్బు ఆదా చేస్తుంది. కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయటకు తీసుకుని వెళ్తుంది. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టేక్కించేందుకు వీరు పొదుపు చేసిన డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది.
శాంత స్వభావి:శాంత స్వభావం గల భార్యను పొందిన వ్యక్తి తనను తాను అత్యంత అదృష్టవంతుడిగా భావించాలి. అలాంటి వారి కుటుంబంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటి స్త్రీలు ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణాన్ని నిర్వహిస్తారు. కష్టాల్లో కూడా తన తెలివితేటలతో పనిచేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకుండా కాపాడుతుంది.
ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న మగవారు అదృష్టవంతులని చాణక్య నీతిలో తెలిపాడు.





Untitled Document
Advertisements