మన దేశంలోనే మొదటిసారిగా సోలార్‌, హైడ్రో పవర్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రసిద్ది .

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 12:16 PM

మన దేశంలోనే మొదటిసారిగా  సోలార్‌, హైడ్రో పవర్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రసిద్ది .

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్‌ పవర్‌ ఎయిర్‌పోర్ట్‌ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌ మొత్తం హైడ్రో, సోలార్‌ పవర్‌తోనే నడుస్తోంది. 2030 నాటికి.. పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తిస్థాయి కార్బన్‌ ఉద్గార రహిత ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రకటించుకుంది. సుమారు రెండు లక్షల టన్నుల కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా తెలిపింది.ఇదిలా ఉంటే.. 2036 దాకా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు హైడ్రోఎలక్ట్రిసిటీ సరఫరా చేసే ఉద్దేశంతో.. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది .కిందటి ఏడాది భారత్‌తో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌ .





Untitled Document
Advertisements