నిమ్మకాయతో మెరిసే కిచెన్ మీ సొంతం

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 03:21 PM

నిమ్మకాయతో మెరిసే కిచెన్ మీ సొంతం

నిమ్మకాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. నిమ్మరసాన్ని వంటల్లోనే కాకుండా వేరే రకంగానూ ఉపయోగించవచ్చు. నిమ్మరసం వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను చంపేస్తుంది. నిమ్మరసం ఉపయోగించి.. వంటగది, బట్టలు శుభ్రం చేసుకోవొచ్చు. అవి ఎలానో చూసేయండి.
*మనం నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో విధంగా వాడుతూనే ఉంటాం. వంటల టేస్ట్‌ పెంచేందుకు నిమ్మరసాన్నిఉపయోగిస్తాం. చాలా మంది బరువు తగ్గడానికి నిమ్మరసం తాగుతూ ఉంటారు. నిమ్మకాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. నిమ్మరసాన్ని వంటల్లోనే కాకుండా వేరే రకంగానూ ఉపయోగించవచ్చు. నిమ్మరసం వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను చంపేస్తుంది. నిమ్మరసం ఉపయోగించి.. వంటగది, బట్టలు శుభ్రం చేస్తే సులభంగా శుభ్రమవుతాయి. అవి ఎలానో చూద్దాం.
*సింక్‌ను శుభ్రం చేయడానికి వంటగదిలో ఉన్న నిమ్మతొక్కలు మరియు నిమ్మరసాన్ని కలిపి మెత్తగా గుజ్జులా చేయాలి. దీన్ని సింక్‌ మొత్తానికి పట్టించాలి. అయిదు పది నిమిషాల తర్వాత దీని మీద నిమ్మరసాన్ని పోసి మరో అయిదు నిమిషాలు నానబెట్టాలి. కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్ది, నీళ్లతో శుభ్రం చేస్తే సింక్‌ శుభ్రమవుతుంది.
*కిచన్‌లో మనం ఎక్కువగా వాడేది.. టవల్‌ .దీని మీద ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. కిచెన్‌ టవల్‌ మీద ఉన్నజిడ్డు వదిలించడం మామూలు విషయం కాదు. దానికున్న జిడ్డు తొలగించాలంటే.. నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. రెండు చెంచాల నిమ్మరసం కలిపిన లీటరు వేడి నీళ్లలో కిచెన్‌ టవల్స్‌ను పావుగంట నానబెట్టాలి. ఆ తర్వాత సబ్బుపెట్టి చేత్తో ఉతికితే సరి.. ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నా చనిపోతాయి.
*నిమ్మరసంతో ఇంట్లోని అద్దాలు శుభ్రం చేయవచ్చు. నిమ్మరసంలో కొద్దిగా నీరు కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇప్పుడు దానిని అద్దం మీద చల్లి ఫైబర్ టవల్‌తో తుదిచేస్తే అద్దం మీద ఉన్న మరకలు చిటికెలో పోతాయి.
*కూరగాయలను కడగడానికి... మరిగించిన వేడి నీళ్లలో నిమ్మరసం కలపాలి. ఈ నీటిలో కూరగాయలను వేసి అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న దుమ్ముధూళీతోపాటు, సూక్ష్మజీవులు పోతాయి. ఇదే విధంగా పండ్లనూ శుభ్రం చేయచ్చు. ఏదైనా బాక్టీరియా మరియు ఇంసేక్ట్స్ ఉంటె తొలగిపోతాయి.
*వంటింట్లో.. చెత్త బుట్ట, సింక్‌ దగ్గర చిన్న చిన్నపురుగులు ఉంటాయి. అవి పోవాలంటే.. మగ్గు నీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా, వంటసోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిని స్ప్రే సీసాలో పోసి సింక్‌లో స్ప్రే చేసి కాసేపు వదిలేయాలి. పదినిమిషాల తర్వాత సింక్‌ను శుభ్రం చేయాలి. వారంలో ఇలా మూడు సార్లు చేస్తే పురుగులు పోతాయి.* నిమ్మరసంతో గ్యాస్‌ బర్నర్‌ ఈజీగా శుభ్రం చేయవచ్చు. ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని అందులో బేకింగ్ సోడా, నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి .పొద్దున్నే,వాటిని బ్రష్‌తో రుద్దండి. శుభ్రమైన నీటితో 2 -3 సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల బర్నర్‌లోని మురికి మొత్తం తొలగిపోతుంది.
*స్టౌ పై వంట చేసేటప్పుడు ఎదో ఒక మరక పడుతూనే ఉంటుంది అలాంటి మరకలు పోవాలంటే. నిమ్మరసం రాసి,స్పాంజితో తుడవాలి. ఇలా చేస్తే జిడ్డు మరకలు పోతాయి.*లీటరు వేడి నీటిలో రెండు చెంచాల చొప్పున నిమ్మరసం, వెనిగర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్లోర్‌పై చల్లి మాపింగ్‌ పెట్టండి. ఇలా చేస్తే నేల శుభ్రమవడమే కాకుండా సూక్ష్మజీవులు చనిపోతాయి.
అవెన్‌ శుభ్రం చేయండి.. ఓ గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని వాటికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. కొన్ని నిమ్మకాయ ముక్కలను కూడా ఆ నీటిలో కలిపి ఆ నీటిని హై టెంపరేచర్‌లో మూడు నిమిషాల పాటు మైక్రో వేవ్‌లో ఉంచండి. ఆ తర్వాత వేడి లేకుండా ఆ నీటిని మరో 5 నిమిషాలు అవెన్ లో ఉంచండి. ఆ తర్వాత తడి బట్టతో అవెన్ తుడిచేస్తే శుబ్రంగా ఉంటుంది.





Untitled Document
Advertisements