నా ముందున్న లక్ష్యం ఇదే : జుకెర్‌బర్క్

     Written by : smtv Desk | Fri, Jan 05, 2018, 05:03 PM

నా ముందున్న లక్ష్యం ఇదే : జుకెర్‌బర్క్

న్యూయార్క్, జనవరి 5 : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. అక్రమాలను అరికట్టే విషయంలో చాలా తప్పులు చేస్తుందంటూ ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకెర్‌బర్క్ అన్నారు. ఈ క్రమంలో ఆయన తన ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఫేస్‌బుక్ వినియోగదారులకు విద్వేషాలు, వేధింపుల నుండి రక్షణ కల్పించాల్సి ఉంది. అంతేకాకుండా వినియోగదారుల ప్రయోజనాల నిమిత్తం కూడా కంపెనీ పని చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఇదే అన్నారు. నూతన సంవత్సరంలో ఈ సమస్యలన్నింటిని నేను ఎదుర్కోవడమే నా ముందున్న అతి పెద్ద సవాల్.. అంటూ వెల్లడించారు.





Untitled Document
Advertisements