అల్లరి నరేష్ మరో కొత్త సినిమా.. టీజర్ రిలీజ్ అప్పుడేనట

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 01:18 PM

అల్లరి నరేష్ మరో కొత్త సినిమా.. టీజర్ రిలీజ్ అప్పుడేనట

నరేష్ కితకితలు చిత్రం తో సినిమా ఇండస్ట్రీ లో చాల ఎదిగాడు. నాంది ఇంకా మహర్షి తర్వాత ఇదే హిట్ అవుతున్న సినిమా..అల్లరి నరేశ్ మరో కొత్త చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం. ఈ నెల 30వ తేదీన టీజర్ రిలీజ్ కాబోతుంది.
అల్లరి నరేశ్ కథానాయకుడిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. మారేడుమిల్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించారు, పాకాల సంగీతాన్ని శ్రీ చరణ్ అందించాడు.
విభిన్నమైన కథాకథనాలతో .. సహజత్వానికి దగ్గరగా ఈ కథ నడుస్తుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో 55 రోజుల పాటు షూటింగ్ చేశామనీ.. 250 మంది ఈ సినిమా కోసం అడవుల్లో పని చేశారని చెప్పారు.
ఈ సినిమా కోసం మారేడుమిల్లిలో ఇంతవరకూ ఎవరూ షూట్ చేయని 22 లొకేషన్స్ లో తాము షూటింగ్ చేశామని అన్నారు. ఉదయాన్నే 3 గంటలకు లేచి నడక మొదలుపెట్టేసి లొకేషన్స్ కి అతడు ఎంత కష్టపడి చేరుకున్నది చూపించారు. మారేడుమిల్లి ఫారెస్టులో టీమ్ తీసుకున్న రిస్క్ కి సంబంధించిన విజువల్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. పూర్తి టీజర్ ను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేస్తాం అంటున్నారు.

Untitled Document
Advertisements