ఈ సినిమాకి థియేట‌ర్ల‌లో ప్లాప్ టాక్.. ఓటీటీలో టాప్-1 ప్లేస్‌

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 05:38 PM

ఈ సినిమాకి థియేట‌ర్ల‌లో ప్లాప్ టాక్..  ఓటీటీలో టాప్-1 ప్లేస్‌

బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్ దర్శకత్వం వహించిన చిత్రం ర‌న్ వే 34 . అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ కీ రోల్స్ లో న‌టించారు. కాగా ఇటీవ‌ల ఆడియన్స్ ముందకు వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద ఫ్లోప్ టాక్ తెచ్చుకుని…ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయ‌లేక‌పోయింది. అయితే ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రానికి ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎవ‌రూ ఊహించని స్పంద‌న వ‌స్తోంది. గ‌త శుక్ర‌వారం ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుద‌లైన ర‌న్ వే 34 టాప్-1 స్థానంలో నిలిచి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అమెజాన్ మూవీ సెక్ష‌న్ జాబితాలో కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2, స‌ర్కారు వారి పాట చిత్రాల‌ను క్రాస్ చేసి మరీ టాప్ 1గా ట్రెండింగ్‌లో నిలువ‌డం విశేషం. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలో మంచి ప్రశంస‌లు ద‌క్కుతున్నాయి.అజ‌య్‌దేవ్‌గ‌న్ హోం బ్యాన‌ర్ అజ‌య్‌దేవ్‌గ‌న్ ఎఫ్‌ఫిలిమ్స్‌, ప‌నోర‌మ స్టూడియోస్ నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బొమ‌న్ ఇరానీ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు.ఈ చిత్రానికి అమ‌ర్ మొహిలే, జ‌స్లీమ్ రాయ‌ల్ సంగీతం అందిచారు .

Untitled Document
Advertisements