రిలయన్స్ జియో చైర్మన్ పదవిలో ఆకాశ్ అంబానీ

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 05:58 PM

రిలయన్స్ జియో చైర్మన్ పదవిలో ఆకాశ్ అంబానీ

ప్రపంచంలోనే అగ్ర సంస్థ అయిన రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ జియో యూనిట్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియో నూతన చైర్మన్ గా ఆకాశ్ అంబానీ వ్యవహరించనున్నట్టు రిలయన్స్ వెల్లడించింది. ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ ఇప్పటివరకు జియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ముఖేశ్ అంబానీ డైరెక్టర్ పదవికి చేసిన రాజీనామా జూన్ 27వ తేదీ నుంచి వర్తిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక, కంపెనీ మేనేజింగ్ డైరెక్టెర్ గా పంకజ్ మోహన్ పవార్ పగ్గాలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు నిన్న నిర్వహించిన జియో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. జియో కొత్త ఎండీగా పంకజ్ మోహన్ పవార్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. కేవీ చౌదరి, రమీందర్ సింగ్ గుజ్రాల్ జియో బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారు.ఇప్పటివరకు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోని అభివృద్ధి లో అగ్ర స్థానంలో ఉంచగా నూతన చైర్మన్ గా ఆకాశ్ అంబానీ ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

Untitled Document
Advertisements