2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓఫ్రా విన్ ఫ్రే పోటీ?

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 11:52 AM

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓఫ్రా విన్ ఫ్రే పోటీ?

న్యూయార్క్, జనవరి 10: "ఓప్రా విన్‌ఫ్రీ షో" అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా జనం వ్యక్తిగత సమస్యలు విని ఊరట ఇచ్చే మాటలతో పరిష్కారాలు సూచించడం ద్వారా ఓప్రా విన్ ఫ్రే అమెరికాలోనే గాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే 2008 ఎన్నికల్లో బరాక్ఒబామా, 2016లో మరో డెమొక్రాట్‌ హిల్లరీ క్లింటన్‌ తరఫున ఓప్రా ప్రచారం చేశారు. బీవర్లీహిల్స్‌లో ‘గోల్డెన్‌ గ్లోబ్స్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొని ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. అధ్యక్ష పదవికి పోటీ అంశాన్ని కొన్ని నెలల క్రితం ఓప్రా ప్రస్తావించారని ఆమె సన్నిహిత మిత్రులిద్దరు సీఎన్ఎన్‌కు చెప్పారు. అలాగే అమెరికా వినోద రంగంలో విశేష కృషి చేసినవారికిచ్చే ‘సెసిల్ డీమిల్’ అవార్డు స్వీకరిస్తూ ఓప్రా అద్భుత ప్రసంగం చేసి అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుకున్నారు.

మీడియాతోపాటు హాలీవుడ్‌లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులను నిరసిస్తూ సాగుతున్న 'మీ టూ ఉద్యమం' ఆమె ప్రసంగంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఎంతో ఆశావహ దృక్పథంతో, 'ఈ కొత్త రోజున ఆశారేఖ కనిపిస్తోంది' అన్న మాటలు ఆమె మరో కోర్కెకు(అధ్యక్ష పదవి) అద్దంపడుతున్నాయని అనేక మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఓప్రా పోటీచేసే అవకాశముందని ప్రసంగం ముగిశాక ఆమె జీవితభాగస్వామి స్టెడ్మన్గ్రహమె చెప్పారు. "అంతా ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె తప్పక ఆ పనిచేస్తారు"అని ఆయన పేర్కొన్నారు.

Untitled Document
Advertisements