గూగుల్ పే @ నగదు రహిత లావాదేవీలు

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 12:10 PM

గూగుల్ పే @ నగదు రహిత లావాదేవీలు

ముంబై, జనవరి 10 : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా "భీమ్ యాప్" ను ప్రవేశపెట్టి నగదు చెల్లింపులను సులభతరం చేసింది. మార్కెట్‌లో నగదు రహిత లావాదేవీలకు నిత్యం నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చింజన్ 'గూగుల్ సంస్థ' గూగుల్‌ వ్యాలెట్‌, ఆండ్రాయిడ్‌ పే ..ఈ రెండింటిని ఏకం చేస్తూ.. "గూగుల్ పే" పేరుతో నూతన చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ గూగుల్‌ పే ద్వారా చేసిన చెల్లింపుల వివరాలన్నీ సంబంధిత వ్యక్తి గూగుల్‌ ఖాతాలో అందుబాటులో ఉంటాయని ఉపాధ్యక్షుడు పాలి భట్‌ పేర్కొన్నారు. ఇటీవల వినియోగదారుల కోసం తేజ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements