అమెరికాలోని సియాటెల్‌ ప్రాంతం ఉద్యోగుల్లో 40 శాతం భారతీయులే

     Written by : smtv Desk | Thu, Jan 18, 2018, 05:11 PM

 అమెరికాలోని సియాటెల్‌ ప్రాంతం ఉద్యోగుల్లో 40 శాతం భారతీయులే

వాషింగ్టన్‌, జనవరి 18 : అమెరికాలోని సియాటెల్‌ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, బోయింగ్‌ తదితర పెద్ద కంపెనీల్లో ఎక్కువగా విదేశీ ఉద్యోగులే ఉండగా, వారిలో 40 శాతం భారతీయులేనని ఓ మీడియా కథనంలో తెలిపింది. అమెరికాలో ఐటీ, టెక్నాలజీ హబ్స్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో విదేశీ ఉద్యోగులే అధికంగా ఉన్నట్లు సియాటెల్‌ టైమ్స్‌ నివేదికలో వెల్లడించింది.

అక్కడ దాదాపు 70శాతం విదేశీ ఉద్యోగులు ఉండగా, వారిలో 40శాతం భారతీయులే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. 13.5శాతం మంది ఉద్యోగులతో చైనా రెండోస్థానంలో నిలిచింది. అమెరికాలో ఐటీ, టెక్నాలజీ హబ్స్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో విదేశీ ఉద్యోగులే అధికంగా ఉన్నట్లు ఈ పత్రిక తెలిపింది.

Untitled Document
Advertisements