దేశీయ స్టాఫ్ మార్కెట్లలో రికార్డుల మోత

     Written by : smtv Desk | Thu, Jan 18, 2018, 06:14 PM

దేశీయ స్టాఫ్ మార్కెట్లలో రికార్డుల మోత

ముంబయి, జనవరి 18 : రానున్న బడ్జెట్ పై ఆశలు సంస్కరణల బాట వీడబోమన్న ప్రభుత్వ హామీలు అంతర్జాతీయ సానుకూలత వల్ల ప్రపంచ మార్కెట్ల పరుగులు వెలసీ దేశీయ స్టాఫ్ మార్కెట్లలో రికార్డుల మోత మోగుతుంది. చరిత్రలో తొలిసారి ఈ నెల 17న 35 వేల పాయింట్ల మైలు రాయి దాటిన ముంబయి స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తుంది.

నేడు ఆరంభ లావాదేవీల్లో 395 పాయింట్ల ఎగబాకి ఏకంగా 35,477 పాయింట్ల సరికొత్త గరిష్ఠన్ని నమోదు చేసింది. గత 17 ట్రైనింగ్ రోజుల్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగబాకడం గమనార్హం. అటు నిఫ్టీ కూడా 10 వేల 887 పాయింట్లు ఎగబాకి సరికొత్త శిఖరాలను తాకింది. ప్రస్తుత దూకుడు చూస్తుంటే నిఫ్టీ రూ. లక్ష పదివేల పాయింట్ల మైలు రాయిని దాటడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Untitled Document
Advertisements