జాగ్వార్‌ రేంజ్ రోవర్ ఎవోక్‌ కొత్త మోడల్ లాంచ్...

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 02:53 PM

జాగ్వార్‌ రేంజ్ రోవర్ ఎవోక్‌ కొత్త మోడల్ లాంచ్...

న్యూ డిల్లీ, జనవరి 20: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ సరికొత్త వాహనాన్ని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. రేంజ్ రోవర్ ఎవోక్‌ లాండ్‌మార్క్‌ కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 50.20 లక్షల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఇండియాలో ఎవాక్‌ మోడల్‌ లాంచ్‌ చేసి ఆరేళ్లయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ పేర్కొంది. ఆకర్షణీయమైన మెరైన్‌ బ్లూ షేడ్‌తో మూడు రంగుల్లో ఇది లభిస్తుందని జాగ్వార్‌ వెల్లడించింది.

పాత రేండ్‌ రోవర్‌ మాదిరిగానే ఉన్నప్పటికీ డిజైన్‌ 2.0 లీటర్ ఇంజినియం డీజిల్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా ఉంది. అలాగే 'ల్యాండ్‌మార్క్‌' లెటర్స్‌ను, గ్రాఫైట్‌ అట్లాస్‌, ముందు భాగంలో ఫెండెర్ వెంట్స్ విజువల్ మార్పులను చేసింది. ఇది 180సీఎస్‌ పవర్ , 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను అమర్చింది. అలాగు తన స్టాండర్డ్‌ వైఫై హాట్‌ స్పాట్‌, ప్రో సేవలు, కీలేస్ ఎంట్రీ , గెశ్చర్‌ ఓరియెంటెడ్‌ టెయిల్ గేటు లాంటి ఆఫర్లు కూడా లభ్యమని జాగ్వార్ ప్రకటించింది.

Untitled Document
Advertisements