అమెరికా పాఠశాలలో ఆగంతకుడి కాల్పులు..

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 12:57 PM

అమెరికా పాఠశాలలో ఆగంతకుడి కాల్పులు..

వాషింగ్టన్, జనవరి 24 : అగ్రరాజ్యంపై మరోమారు కాల్పుల మోత మోగింది. ఓ ఆగంతకుడు కెంటకీ హై స్కూల్‌లోకి ప్రవేశించి విచక్షణ కోల్పోయి కాల్పులకు తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని పోలీసులు అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ధాటికి భయపడి కొందరు విద్యార్థులు పక్కనే ఉన్న పొలాలలోకి పరుగులు తీయగా.. మరి కొందరు వాహనాలలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా 2018 నూతన సంవత్సరంలో జరిగిన తొలి దాడి ఇదేన౦టూ అధికారులు పేర్కొన్నారు.

Untitled Document
Advertisements