జైలులో పుంజులను ఎప్పుడైనా చూశారా.?

     Written by : smtv Desk | Thu, Jan 25, 2018, 12:50 PM

జైలులో పుంజులను ఎప్పుడైనా చూశారా.?

అచ్యుతాపురం, జనవరి 25 : జైల్లో సాధారణంగా నేరస్తులను పెడుతుంటారు. కాని కోడిపుంజులను పెట్టడం ఎక్కడైనా చూశారా.? ఇక్కడ అదే జరిగింది. ఈ మధ్య కాలంలో విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన కోడిపందేలపై పోలీసులు వరసగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు తొమ్మిది పుంజులను అదుపులోకి తీసుకున్నారు.

ఆ నిందితులను వ్యక్తిగత పూచీపై విడిచిపెట్టారు. అనంతరం నిందితులను, పుంజులను ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టగా, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కోడిపుంజులను ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. దీంతో చేసేదేమీ లేక ఆ పుంజులను తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ప్రస్తుతం అచ్యుతాపురం పోలీసుస్టేషన్‌ జైలు కోడిపుంజులతో కళగా ఉంది.





Untitled Document
Advertisements