కుప్పంలో 2500 అడుగుల జాతీయ పతాకం..

     Written by : smtv Desk | Fri, Jan 26, 2018, 06:15 PM

కుప్పంలో 2500 అడుగుల జాతీయ పతాకం..

చిత్తూరు, జనవరి 26: రాష్ట్రంలో అన్ని జిల్లాలో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురష్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయలలో జాతీయ పతకం రెపరెపలాడింది. ఇందులో భాగంగా చిత్తూరులో గల కుప్పంలో 2500 అడుగుల పొడవైన జాతీయజెండాను ప్రదర్శించారు. స్ధానిక కుప్పం ఇంజనీరింగ్‌ కళాశాల, బీసీఎస్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాను నరగవీధుల్లో ఊరేగించారు. కుప్పం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బైపాస్‌ రోడ్‌ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.

Untitled Document
Advertisements