కొండాపూర్ లో యువతి దారుణ హత్య..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 11:21 AM

కొండాపూర్ లో యువతి దారుణ హత్య..

హైదరాబాద్, జనవరి 30 : నగరంలోని కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఒక గోనె సంచిలో చుట్టి రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. ఈ విషయం గమనించిన జీహెచ్‌ఎంసీ కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న సీసీటీవీ పుటేజ్ లో వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మృతురాలిని దేవరకొండకు చెందిన అనూషగా గుర్తించారు.





Untitled Document
Advertisements