అమరావతిలో స్మార్ట్ సైకిళ్ళ పరుగులు..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 02:52 PM

అమరావతిలో స్మార్ట్ సైకిళ్ళ పరుగులు..

అమరావతి, జనవరి 31 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్ సైకిల్ సవారీని లాంఛనంగా ప్రారంభించారు. సీఆర్దీయే పరిధిలో వీటికి ప్రత్యేక ట్రాక్ లను ఏర్పాటు చేస్తుండగా నేడు సచివాలయంలో ఈ స్మార్ట్ సైకిళ్ళను ప్రారంభించారు. లక్ష రూపాయలు విలువ చేసే ఈ ఒక్కో సైకిళ్ళకు సంబంధించి సచివాలయం పరిధిలో మొత్తం మూడు స్మార్ట్ సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి స్టేషన్లలొ 10 సైకిళ్ళను అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సైకిల్ సవారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సైకిల్ కావలసిన వారు పేరు నమోదు చేసుకుంటే ప్రత్యేకమైన 'యాక్సెస్‌ కార్డు' ఇస్తారు. యాక్సెస్‌ కార్డుని సైకిల్‌కుండే కంప్యూటర్‌కి చూపిస్తే తాళం తెరుచుకుంటుంది. ఇందులో భాగంగా ఏ సైకిల్‌ స్టేషన్లలోనైనా సైకిల్‌ తీసుకోవచ్చు, మళ్ళీ ఎక్కడైనా అప్పగించవచ్చు. ఉచితంగానే వినియోగించుకోవచ్చు.

Untitled Document
Advertisements